బ్రిటన్ పార్లమెంట్‌కు డిసెంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతిపాదనకు విపక్ష లేబర్ పార్టీ అంగీకారం తెలిపింది. అయితే ఎన్నికలకు సంబంధించి తేది నిర్ధరణ కాలేదు.
"మేం ఎన్నికలకు సిద్ధమేనని స్థిరంగా చెబుతున్నాను. 'నోడీల్ బ్రెగ్జిట్'ను బోరిస్ ప్రభుత్వం పక్కన పెడితే.. మేము కచ్చితంగా ఎన్నికలను అంగీకరిస్తాం. దేశంలో నిజమైన మార్పును తీసుకువచ్చే దిశగా ప్రచారాన్ని ప్రారంభిస్తాం."
-జెరెమీ కార్బిన్, లేబర్ పార్టీ నేత
సోమవారం ఈయూ నేతలు తీసుకున్న నిర్ణయం పట్ల స్పందించారు కార్బిన్. రాబోయే మూడు నెలల్లో.. ఎలాంటి ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే అంశాన్ని ప్రభుత్వం పక్కనపెట్టడం వల్ల తాము విజయం సాధించామన్నారు.
బోరిస్ జాన్సన్ డిసెంబర్ 12వ తేదిన ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించగా.. లేబర్ పార్టీ సహా ఇతర విపక్షాలు డిసెంబర్ 9నే పోలింగ్ నిర్వహించాలని కోరుతున్నాయి.
ఇదీ చూడండి: దిల్లీని కాపాడాలని పొరుగు రాష్ట్రాలకు సీఎం విజ్ఞప్తి