ETV Bharat / international

ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి? మూడు వైపులా రష్యా బలగాల మోహరింపు! - ఉక్రెయిన్ రష్యా

Ukraine Russia Conflict: రష్యా-ఉక్రెయిన్​ సరిహద్దుల్లో వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా.. మూడు వైపులా బలగాలను మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. మరోవైపు.. రష్యా ఏ రోజైనా దాడి చేయనుందన్న అమెరికా నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో కొన్ని సంస్థలు ఉక్రెయిన్‌కు విమాన రాకపోకలను నిలిపివేశాయి.

Ukraine Russia Conflict
రష్యా, ఉక్రేన్​ యుద్ధం
author img

By

Published : Feb 14, 2022, 3:55 AM IST

Ukraine Russia Conflict: ఐరోపా.. యుద్ధం ముంగిట్లో ఉంది. ఉక్రెయిన్‌ ఆక్రమణకు రష్యా సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా వెలుగుచూసిన ఉపగ్రహ చిత్రాలు ఆ ప్రాంతంలో కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలకు దర్పణం పడుతున్నాయి. ఉక్రెయిన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు మూడు వైపుల నుంచి సైనిక మోహరింపులను రష్యా చేసినట్లు వెల్లడైంది. క్రిమియా, బెలారస్‌తోపాటు తూర్పు ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో సైనిక పదఘట్టనలు, యుద్ధ ట్యాంకుల రొదలు, శతఘ్ని, క్షిపణి దళాల కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తూర్పు ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌లోని దొనెస్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలపై రష్యా ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అక్కడ ఉక్రెయిన్‌ దళాలకు, రష్యా మద్దతున్న వేర్పాటువాదులకు మధ్య 2014 నుంచి పోరు సాగుతోంది. తూర్పు ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరువలో తన సైనిక బలగాన్ని రష్యా పెంచుకుంటోంది. దీంతో ఈ ప్రాంతం గుండానే సైనిక చర్యను ఆరంభించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • రష్యాలోని యెల్న్యాలో ఉన్న భారీ సైనిక స్థావరంలో 2021 చివర్లో దాదాపు 700 ట్యాంకులు, పదాతిదళ పోరాట శకటాలు, శతఘ్నులు, బాలిస్టిక్‌ క్షిపణి లాంచర్లు ఉండేవి. ఇటీవల ఆ శిబిరం చాలావరకు ఖాళీగా కనిపిస్తోంది. అక్కడి ఆయుధ సామగ్రిని రైలు, రోడ్డు మార్గంలో బ్రయాన్స్క్‌ ప్రాంతానికి తరలించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఉక్రెయిన్‌ సరిహద్దుకు చేరువలో ఉంది.
  • ఈశాన్య ఉక్రెయిన్‌కు సరిహద్దుల్లోని కర్స్క్‌, బెల్గోరాడ్‌ ఓబ్లాస్ట్స్‌ ప్రాంతాల్లోనూ సైనిక కదలికలు పెరిగాయి. రష్యాకు చెందిన బలమైన దాడి దళం 'ఫస్ట్‌ గార్డ్స్‌ ట్యాంక్‌ ఆర్మీ' సాధారణంగా మాస్కో ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు అది ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు అనువైన మార్గంలో మోహరించింది.
    Ukraine Russia Conflict
    ఫిబ్రవరి 10న క్రిమియాలోని ఒక్ట్యాబ్రస్కోయే వైమానిక స్థావరంలో రష్యా బలగాలు (ఉపగ్రహ చిత్రం)

బెలారస్‌

బెలారస్‌కు రష్యాకు మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడానికి ఈ దేశాన్ని కూడా రష్యా ఉపయోగించుకునే వీలుంది. బెలారస్‌లో ఇప్పటికే మోహరింపులను పెంచింది. 30వేల మంది సైనికులు, స్పెట్స్‌నాజ్‌ ప్రత్యేక బలగాలు, సుఖోయ్‌-35 సహా పలు రకాల యుద్ధవిమానాలు, ఇస్కాందర్‌ క్షిపణులు, ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ వంటివి ఇందులో ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత బెలారస్‌లో ఇంత భారీగా రష్యా సైనిక మోహరింపులు జరగలేదు. రెండు దేశాల సైన్యాలు గురువారం నుంచి యుద్ధవిన్యాసాలు నిర్వహిస్తున్నాయి.

  • బెలారస్‌లోని గోమెల్‌కు సమీపంలోని జ్యాబ్రోవక్కా వైమానిక క్షేత్రం వద్ద కొత్తగా రష్యా బలగాలు, సైనిక వాహనాలు, హెలికాప్టర్లు కనిపించాయి. ఈ ప్రాంతం ఉక్రెయిన్‌ సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • హోమెల్‌ ప్రాంతంలోని రెచిత్సా వద్ద తొలిసారిగా సైనిక గుడారాలు వెలిసినట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఈ ప్రదేశం ఉక్రెయిన్‌ సరిహద్దుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇబ్బందులు ఉన్నాయి..

బెలారస్‌ సరిహద్దు గుండా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడానికి 'ప్రిన్స్క్‌ మార్షస్‌' చిత్తడి నేలల రూపంలో రష్యన్‌ సైనికులకు ఇబ్బందులు తప్పవు. బెలారస్‌, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో దాదాపు లక్ష చదరపు మైళ్ల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. 1941లో హిట్లర్‌ సేన నాటి సోవియట్‌ యూనియన్‌ను ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రాంతంలోనే ఇబ్బందులను ఎదుర్కొంది.

క్రిమియా

క్రిమియాను 2014లో రష్యా ఆక్రమించింది. ఉక్రెయిన్‌పై చేపట్టే సైనిక చర్యలో విడిది కేంద్రంగా ఈ ప్రాంతాన్ని రష్యా సైన్యం ఉపయోగించుకునే వీలుంది. ఈ నెల 10న క్రిమియా రాజధాని సిమ్‌ఫెరోపోల్‌కు ఉత్తరాన ఉన్న ఒక్ట్యాబ్రస్కోయే వైమానిక స్థావరంలో భారీ సంఖ్యలో బలగాల మోహరింపు కనిపించింది. 550 గుడారాలు, వందలాది వాహనాలు అక్కడ ఉన్నాయి.

  • డోనుజ్‌లావ్‌ సరస్సు ఒడ్డున ఉన్న నొవోజెర్నోయే ప్రాంతంలో కొత్తగా బలగాలు, శతఘ్ని దళాలు, సైనిక సాధన సంపత్తి దర్శనమిచ్చాయి. బలగాలు భారీగా అక్కడ యుద్ధ శిక్షణ పొందుతున్నాయి.
  • క్రిమియా ద్వీపకల్పానికి వాయవ్య తీరాన ఉన్న స్లావ్‌నే పట్టణం వద్ద గురువారం సైన్యాన్ని రష్యా మోహరించింది.

విమానాలు ఆపేస్తున్న దేశాలు

రష్యా ఏ రోజైనా దాడి చేయనుందన్న అమెరికా నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో కొన్ని సంస్థలు ఉక్రెయిన్‌కు విమాన రాకపోకలను నిలిపివేశాయి. తదుపరి నోటీసులు జారీ చేసేవరకు ఉక్రెయిన్‌కు వెళ్లే తమ విమానాలపై ఆంక్షలు విధించినట్లు డచ్‌ ఎయిర్‌లైన్‌ కేఎల్‌మ్‌ తెలిపింది. స్కైఅప్‌ సంస్థ కూడా.. పోర్చుగల్‌లోని మదేరా నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళుతున్న విమానాన్ని చివరి నిమిషంలో మాల్దోవాకు మళ్లించింది. తమ విమానాలను ఉక్రెయిన్‌ గగనతలంపై తిరగకుండా నిషేధించామని పేర్కొంది. ఉక్రెయిన్‌ మాత్రం తమ గగనతలాన్ని మూయలేదని స్పష్టం చేసింది.

అమెరికా సహా పలు ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌లో ఉన్న తమ పౌరులను ఇప్పటికే హెచ్చరించాయి. ఇంకెంత మాత్రం ఆ దేశం సురక్షితం కాదని పేర్కొన్నాయి. రష్యా దాడి వార్తల ప్రభావాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలన్‌స్కీ తగ్గించే ప్రయత్నం చేశారు. అవసరానికి మించిన సమాచారం.. ప్రస్తుత సమాచార యుగంలో అందుబాటులో ఉండటమూ సమస్యేనని పేర్కొన్నారు. అనవసరంగా అమెరికా ఒక రకమైన భయానక వాతావరణం సృష్టిస్తోందని రష్యా ఆరోపించింది.

ఇదీ చూడండి : పుతిన్​కు బైడెన్​ ఫోన్​... తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.