ETV Bharat / international

బ్రిటన్​లో రికార్డు స్థాయిలో రోజువారీ కరోనా కేసులు - కొత్త రకం కరోనా వైరస్​

బ్రిటన్​లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులో 57,725 కేసులు వెలుగుచూశాయి. ఈ తరుణంలో పాఠశాలలను మరో రెండు వారాలపాటు మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరాయి ఉపాధ్యాయ సంఘాలు.

UK hits daily virus record, is urged to keep schools closed
బ్రిటన్​లో రికార్డు స్థాయిలో కేసులు- స్కూళ్లు మూసివేయాలని డిమాండ్​
author img

By

Published : Jan 3, 2021, 5:15 AM IST

బ్రిటన్​లో కొత్త రకం కరోనా వైరస్​ కలకలం రేపుతోంది. రోజువారీ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత 5 రోజులుగా రోజుకు సగటున 50వేలకుపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. శనివారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 57,725 మంది కొవిడ్​​ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 26లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు అక్కడ సుమారు 75వేల​ మంది కొవిడ్​కు బలయ్యారు. అయితే.. రానున్న రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

కొత్త రకం కరోనా వైరస్​.. లండన్​ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. అక్కడి పాఠశాలలను మరో రెండువారాల పాటు మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరాయి ఉపాధ్యాయ సంఘాలు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళనల నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేశాయి. కనీసం మరో 14 రోజుల పాటు ఆన్​లైన్​ క్లాసుల నిర్వహణకు అనుమతి కోరుతూ ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్​ను అభ్యర్థించాయి.

ప్రభుత్వం గతంలో సూచించిన విధంగా.. ఈ నెల 4 నుంచి లండన్​లో ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న డిమాండ్​తో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 11 నుంచి ఆరంభం కావాల్సిన పరీక్షలు ఇప్పటికే వాయిదాపడగా.. నిర్వహణ తేదీపై మరింత సందిగ్ధత నెలకొంది.

ఇదీ చదవండి: 'వారానికి 2 మిలియన్ల వ్యాక్సిన్​ డోసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.