ETV Bharat / international

మళ్లీ బ్రిటన్​ ప్రధానిగా బోరిస్​- కన్జర్వేటివ్​ పార్టీ జయభేరి - బ్రిటన్​ ఎన్నికల ఫలితాలు

BREXIT
బ్రెగ్జిట్​
author img

By

Published : Dec 13, 2019, 9:42 AM IST

Updated : Dec 13, 2019, 11:50 AM IST

10:32 December 13

బ్రిటన్‌లో బోరిస్‌ జాన్సన్‌ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. గురువారం జరిగిన బ్రిటన్‌ సాధారణ ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతోంది. తొలి అధికారిక ఫలితాల్లో కన్సర్వేటివ్స్‌ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు అధికారవర్గాలు ప్రకటించాయి. పశ్చిమ లండన్‌లోని ఉక్స్‌బ్రిడ్జ్‌ నుంచి పోటీ చేసిన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గతం కన్నా ఎక్కువ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటికే కన్జర్వేటివ్​ పార్టీ సగానికి పైగా స్థానాలను కైవసం చేసుకుంది.

బ్రెగ్జిట్‌ ప్రక్రియ సమర్థంగా నిర్వహించేందుకు, దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు బ్రిటన్‌ ప్రజలు తనకు శక్తిమంతమైన మెజార్టీ కట్టబెట్టారని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు.

ఐరోపా సమాఖ్య ఇచ్చిన గడువులోపు బ్రిటన్ వైదొలగలేకపోయింది. ఈ నేపథ్యంలో 2020 జనవరి 31 తదుపరి గడువు విధిస్తూ ఐరోపా సమాఖ్య మరో అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో సంపూర్ణ మెజార్టీ కోరుతూ బోరిస్ జాన్సన్​ ఎన్నికలకు వెళ్లారు. ఆయనకే ఈసారి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

అంచనాలు నిజమయ్యాయి!

ఎగ్జిట్‌ సర్వేల అంచనాలను ప్రతిబింబిస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. బ్రిటన్‌ పార్లమెంటులో మొత్తం 650 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగ్గా 368 సీట్లతో కన్జర్వేటివ్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని బీబీసీ, ఐటీవీ, స్కై టీవీలు అంచనా వేశాయి. ప్రతిపక్ష లేబర్ పార్టీ 191 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపాయి.

మరోవైపు ఫలితాలు పూర్తిగా వెలువడకముందే లేబర్‌ పార్టీ నేత జెరెమీ కార్బైన్‌ తన పదవికి రాజీనామా చేశారు. తమ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

‍‌

10:14 December 13

చారిత్రక విజయం దిశగా...

బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ విజయానికి చేరువలో ఉంది. 650 సీట్లలో 540 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. 287 స్థానాల్లో కన్జర్వేటివ్‌ పార్టీ విజయం సాధించింది. చారిత్రక పరాజయం దిశగా లేబర్‌ పార్టీ అడుగులు వేస్తోంది.

09:47 December 13

కార్బన్​ రాజీనామా...

ఎన్నికల ఫలితాల్లో లేబర్​ పార్టీ ఘోర ఓటమి వైపు అడుగులు వేస్తోన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా జెరేమి కార్బైన్‌ ​ రాజీనామా చేశారు.

09:22 December 13

యూకే ఫలితాలు: బోరిస్ దూకుడు​.. బ్రెగ్జిట్​కే బ్రిటన్​ ఓటు

బ్రిటన్​లోని 650 పార్లమెంట్ దిగువ సభ స్థానాలకు (హౌస్​ ఆఫ్ కామన్స్) జరిగిన ఎన్నికల ఫలితాల్లో బోరిస్​ జాన్సన్ నేతృత్వం వహిస్తోన్న కన్జర్వేటివ్​ పార్టీ దూసుకుపోతోంది. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే అంశంపై తాజా ఎన్నికలు కీలక ప్రభావం చూపాయి. కన్జర్వేటివ్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా వెళ్తోంది. ప్రస్తుత ఫలితాలను చూస్తే కన్జర్వేటివ్​ పార్టీకి భారీ ఆధిక్యం దక్కే అవకాశం కనిపిస్తోంది. 

బ్రెగ్జిట్​ ప్రక్రియ వెంటనే ముగించాలనే అంశంతో ప్రధానంగా బోరిస్ ఎన్నికలకు వెళ్లగా... మరోసారి ఈ అంశంపై రిఫరెండంను నిర్వహించడమే అజెండాగా ప్రతిపక్షాలు ముందుకు వెళ్లాయి. 

Guwahati (Assam), Dec 12 (ANI): Chief Minister of Assam, Sarbananda Sonowal on Thursday appealed to all sections of people of Assam to maintain peace and tranquillity in the state. While speaking to ANI, he said, "I sincerely appeal to all sections of people of Assam to maintain peace and tranquillity. It's our cultural, social and spiritual tradition. I've firm belief that people of Assam, as usual, will maintain peace for all time to come." "Section of people is trying to make the situation aggravated by spreading misinformation and misleading people by saying that 10-15 million people are going to take citizenship in Assam. It's false propaganda," he added.
Last Updated : Dec 13, 2019, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.