స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు బ్రిటన్‌లో కొందరు విద్యార్థులు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరించుకొని పాఠశాలలు ఎగ్గొడుతున్నారు. పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ వచ్చేందుకు జ్యూస్, వెనిగర్‌ను వినియోగిస్తున్నారు. కాగా వీటిని వారు టిక్‌టాక్ ద్వారా నేర్చుకుంటుండటం గమనార్హం. అయితే విద్యార్థులు ఇలా చేయడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిమ్మరసం, యాపిల్ సాస్‌తో..
యూకేకు చెందిన ఐన్యూస్ ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం.. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ చేసుకునేందుకు టీనేజర్లు కొన్ని వింత చిట్కాలను ఎంచుకుంటున్నారు. కరోనా టెస్టు పాజిటివ్‌గా వచ్చేందుకు యాంటీజెన్ టెస్టు కిట్‌లో నిమ్మరసం, యాపిల్ సాస్, కోకకోలా, వెనిగర్, శానిటైజర్ మిశ్రమాన్ని వేస్తున్నారు. దీంతో అది పాజిటివ్‌గా చూపించటం వల్ల స్కూల్ ఎగ్గొడుతున్నారు. ఇలాంటి అనేక వీడియోలు టిక్‌టాక్‌లో చక్కర్లు కొడుతున్నాయని, వీటిని ఫేక్ కొవిడ్‌టెస్ట్ అనే హాష్‌ట్యాగ్ జోడించి విడుదల చేస్తున్నారని పేర్కొంది. కాగా వాటిని మిలియన్ల కొద్దీ వీక్షిస్తున్నట్లు వెల్లడించింది. ఇది సరైన పద్ధతి కాదని.. కొవిడ్ పరీక్షలను దుర్వినియోగం చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని వారు కోరుతున్నారు.
తొలగించాం..
'ఫిజీ' పానీయాలు, పులుపు ఉండే పండ్ల రసాలను ర్యాపిడ్ యాంటీజెన్ కిట్‌లో వేస్తే పాజిటివ్‌గా చూపే అవకాశాలున్నాయని యూకేకు చెందిన 'ఫుల్ ఫ్యాక్ట్'ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ తెలిపింది. అయితే ఈ తరహా వీడియోలు టిక్‌టాక్‌లో చక్కర్లు కొడుతున్నాయని వస్తున్న వార్తలపై సామాజిక మాధ్యమం స్పందించింది. నెటిజన్లను తప్పుదోవ పట్టించే వీడియోలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు పేర్కొంటోంది. కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారమిచ్చే అనేక వీడియోలను తొలగించినట్లు టిక్‌టాక్ వెల్లడిస్తోంది.
ఇదీ చూడండి: వాసనతో కరోనాను పసిగట్టే సాధనం!
ఇదీ చూడండి: స్మార్ట్ ఫోన్‌తోనూ కొవిడ్ నిర్ధరణ పరీక్ష!