ETV Bharat / international

లాక్​డౌన్​ సడలింపుతో ​మోగిన బడి గంటలు!

ఫ్రాన్స్​ రాజధాని పారిస్​లో లాక్​డౌన్​ ఆంక్షలు సడలించింది ప్రభుత్వం. పాఠశాలలను తిరిగి ప్రారంభించింది. దాదాపు రెండు నెలల తర్వాత ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు పాఠశాలలకు వచ్చారు.

Schools reopened two months later in Paris, France's capital.
లాక్​డౌన్​ సడలింపుతో ​మోగిన బడి గంటలు!
author img

By

Published : May 14, 2020, 9:28 PM IST

లాక్​డౌన్​ సడలింపుతో ​మోగిన బడి గంటలు!

ఫ్రాన్స్​లో కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. దేశంలో విధించిన లాక్​డౌన్​ను సడలించింది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో పారిస్​లో పాఠశాలలను పునఃప్రారంభించారు అధికారులు. లాక్​డౌన్​ కాలంలో రెండునెలల పాటు ఇంట్లో గడిపిన విద్యార్థులు పాఠశాలలో అడుగుపెట్టారు. చాలా రోజుల తర్వాత స్నేహితులు కనపడగా వారి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.

తమ పిల్లల ఆరోగ్య సంరక్షణ విషయంలో భయాందోళన ఉన్నప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని ఆశిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పిల్లల్లో శుభ్రతపై అవగాహన పెంచాలని పాఠశాల నిర్వహకులు అంటున్నారు.

విద్యార్థులు శానిటరీ ప్రోటోకాల్​ గురించి అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం వారి స్థాయికి తగ్గట్లు పాటలు, సంగీతం ద్వారా చేతులను ఎలా శుభ్రపరుచుకోవాలనే విషయం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు. కానీ పిల్లల్లో భౌతిక దూరం పాటించేలా చేయడమే కష్టం.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు

దేశంలో 86 శాతం ప్రీస్కూళ్లు, ప్రాథమిక పాఠశాలలు ఈ వారంలో తెరవనున్నట్లు ఫ్రెంచ్​ అధికారులు తెలిపారు. ప్రీ స్కూళ్లలో ప్రతి ఐదుగురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడి చొప్పున నియమించారు. పాఠశాలలో ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలనే నియమాలు రూపొందించారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించారు.

వైరస్​ భయాందోళనల నడుమ పిల్లలను ఇంట్లోనే ఉంచేందుకు తల్లిదండ్రులకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. పాఠశాలలో హాజరు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.