ETV Bharat / international

భీకర దాడులకు తాత్కాలిక విరామం.. రష్యా కాల్పుల విరమణ ప్రకటన

Russia Ukraine War: గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్​పై విరుచుకుపడుతున్న రష్యా తాత్కాలిక విరామాన్ని ప్రకటించింది. పౌరులను సురక్షితంగా తరలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Russia Ukraine War
భీకర దాడులకు తాత్కాలిక విరామం.. రష్యా ప్రకటన
author img

By

Published : Mar 5, 2022, 12:37 PM IST

Updated : Mar 5, 2022, 1:15 PM IST

Russia Ukraine War: ఉక్రెయిన్​పై గత పది రోజులుగా జరుపుతున్న భీకర దాడులకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించింది రష్యా. ఆ దేశంలోని మారియుపోల్​, వోల్నవోఖ్‌ నగరాల్లో మానవతా కారిడార్‌ ఏర్పాటు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ రెండు ప్రాంతాల్లో కాల్పుల విరమణను పాటించనున్నట్లు స్పష్టం చేసింది.

మాస్కో కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల నుంచి తమ దళాలు కాల్పులను నిలిపి వేస్తాయని రష్యా వెల్లడించింది.

రష్యా నిర్ణయంతో బాంబు దాడులు, తుపాకుల మోతతో దద్ధరిల్లుతున్న ఆ ప్రాంతాలకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. ఈ నేపథ్యంలో పౌరుల తరలింపు సులభతరం అయ్యే అవకాశాలు ఉన్నా ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్‌ ధ్రువీకరించలేదు.

ఓడరేవు ఉన్న మారియుపోల్‌ను రష్యా వ్యూహాత్మక పట్టణంగా భావిస్తోంది. ఈ పట్టణం సహా వోల్నవోఖ్‌ను ఇప్పటికే రష్యా దళాలు ముట్టడించాయి.

Last Updated : Mar 5, 2022, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.