ETV Bharat / international

ఉక్రెయిన్​లో కాల్పుల విరమణ.. రష్యాలో ఆ సంస్థల సేవలు బంద్​!

Russia Ukraine war: ఉక్రెయిన్​పై రెండు వారాలకుపైగా దాడులు కొనసాగిస్తున్న రష్యా.. పౌరుల తరలింపునకు బుధవారం పలు నగరాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. మానవతా కారిడార్ల ఏర్పాటులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులందరినీ పోల్టావాకు తరలించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు.. రష్యాలో మెక్​డొనాల్డ్స్​, పెప్సికో సహా పలు సంస్థలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

Russia Ukraine war
ఉక్రెయిన్​, రష్యా యుద్ధం
author img

By

Published : Mar 9, 2022, 9:17 AM IST

Russia Ukraine war: ఉక్రెయిన్​లోని పౌరులను తరలించే మానవతా కారిడార్ల ఏర్పాటు కోసం బుధవారం ఉదయం తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. కీవ్​తో పాటు పలు కీలక నగరాల్లో మానవతా కారిడార్ల ఏర్పాటులో భాగంగా కాల్పులకు విరామం ప్రకటించినట్లు స్పుత్నిక్​ న్యూస్​ తెలిపింది.

విదేశీయులతో పాటు ఉక్రెయిన్​ పౌరులను తరలించేందుకు మానవతా కారిడార్లకు విఘాతం కలుగుతోందని ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకున్న క్రమంలో.. ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. చెర్నిహివ్​, సుమీ, ఖర్కివ్​, మేరియుపొల్​, జపోరిజియా నగరాల్లో బుధవారం కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు మీడియా తెలిపింది.

"పౌరులను తరలించేందుకు రష్యా మరోమారు అవకాశం కల్పించింది. ఉక్రెయిన్​ తక్షణమే స్పందించాలి. నిర్దిష్ట మార్గాల్లో 2022, మార్చి 9న ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రతిపాదనకు రాతపూర్వక ఆమోదంతో పాటు భద్రతకు భరోసా కల్పించాలని ప్రకటనలో పేర్కొంది."

- మైకేల్​ మిజింత్సేవ్​, మానవతా కారిడార్​ హెడ్​

సుమీ నగరంలో పౌరుల తరలింపు మంగళవారమే ప్రారంభమైంది. అలాగే.. కీవ్​ నగరం వెలుపలి ప్రజలను సైతం తరలిస్తున్నారు.

సుమీ నుంచి భారత విద్యార్థుల తరలింపు..

భీకర దాడులకు నెలవైన ఉక్రెయిన్​లోని సుమీ నగరం నుంచి భారత విద్యార్థులు బయటపడ్డారు. ఆపరేషన్​ గంగలో భాగంగా వారిని భారత్​కు తీసుకొచ్చేందుకు విమానాలు సిద్ధమవుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. బస్సుల్లో 175 కిలోమీటర్ల దూరంలోని పోల్టావాకు తరలించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్​ బాగ్చీ తెలిపారు. 'సుమీ నుంచి భారతీయ విద్యార్థులందరినీ తరలించటం సంతోషంగా ఉంది. వారంతా పోల్టావాకు వెళ్తున్నారు. అక్కడి నుంచి ట్రైన్​ ద్వారా పశ్చిమ ఉక్రెయిన్​కు చేరుకుంటారు. ఆపరేషన్​ గంగలో భాగంగా నడిచే విమానాలు వారిని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి' అని ట్వీట్​ చేశారు. బస్సుల సమీపంలో విద్యార్థులు ఉన్న వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు బాగ్చీ.

మరోవైపు.. సుమీ నగరంలోని పౌరులను తరలించేందుకు రష్యన్​ ఫెడరేషన్​ సేనలు కల్పించిన భద్రతను కొనియాడింది భారత్​లోని రష్యా రాయబార కార్యాలయం. మొత్తం 723 మందిని సుమీ నుంచి పశ్చిమ ఉక్రెయిన్​కు తరలించగా అందులో 576 మంది భారతీయులు, 115 మంది చైనా, 20 మంది జోర్డాన్​, 12 మంది ట్యునీసియా దేశస్థులు ఉన్నట్లు పేర్కొంది.

రష్యాలో మెక్​డొనాల్డ్స్​ సేవలు బంద్​..

ఉక్రెయిన్​పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా రష్యాలోని తమ 850 రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది మెక్​డొనాల్డ్స్​. దీని ద్వారా ప్రభావితమయ్యే 62,000 మంది సంస్థ ఉద్యోగులకు వేతనాలు చెల్లించటం కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. ఉక్రెయిన్​లోని ప్రజల దయనీయ పరిస్థితి మరవలేనిదని పేర్కొన్నారు సంస్థ అధ్యక్షుడు, సీఈఓ క్రిస్​ పేర్కొన్నారు. తమ స్టోర్లను తిరిగి ఎప్పుడు తెరుస్తామో కచ్చితంగా చెప్పలేమన్నారు. తమలాంటి అంతర్జాతీయ బ్రాండ్లకు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితిగా పేర్కొన్నారు. మరోవైపు.. ఉక్రెయిన్​లోని 108 రెస్టారెంట్లను ఇప్పటికే మూసివేసింది మెక్​డొనాల్డ్స్​.

స్టార్​బక్స్​ స్టోర్ల మూసివేత

రష్యాలోని 130 స్టోర్ల ద్వారా వచ్చే లాభాలను ఉక్రెయిన్​కు సాయంగా ఇస్తున్నట్లు గత వారం ప్రకటించింది కువైట్​కు చెందిన అల్సాయా గ్రూప్​ సంస్థ స్టార్​బక్స్. ​అయితే, తాజాగా.. ఆయా స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మంగళవారం తెలిపింది. అయితే, రష్యాలోని తమ స్టోర్లలో పనిచేస్తున్న 2వేల మంది సిబ్బందికి జీతాలు కొనసాగిస్తామని భరోసా కల్పించారు ఆ సంస్థ సీఈఓ కెవిన్​ జాన్సన్​.

కోకాకోలా, పెప్సికో..

ఉక్రెయిన్​పై దాడికి నిరసనగా రష్యాలోని తమ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది కొకాకోలా సంస్థ. అలాగే.. పెప్సికో, సైతం రష్యాలో తమ వ్యాపారాలను పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. రష్యాలో తమ విక్రయాలను ఆపేస్తున్నట్లు తెలిపిన పెప్సీ.. మూలధన పెట్టుబడులు, ఇతర ప్రమోషనల్​ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అయితే.. రష్యాలోని 20వేల మంది ఉద్యోగులు, 40వేల మంది రైతులకు మద్దతుగా.. పాలు, బేబీ ఫార్ములా, బేబీ ఫుడ్​ తయారీని కొనసాగిస్తామని తెలిపింది.

జనరల్​ ఎలక్ట్రిక్​..

రష్యాలో తమ కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది జనరల్​ ఎలక్ట్రిక్​. ఔషధ సామగ్రి, విద్యుత్తు సేవలకు ఇందులోకి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.

పోలాండ్​ ఆఫర్​ తిరస్కరణ..

రష్యా భీకర దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్​కు మద్దతుగా నిలిచేందుకు ముందుకు వస్తున్నాయి పశ్చిమ దేశాలు. ఈ క్రమంలోనే రష్యా తయారు చేసిన ఫైటర్​ జెట్స్​ను ఉక్రెయిన్​కు ఇవ్వనున్నట్లు తెలిపింది పోలాండ్​. అయితే, ఈ ఆఫర్​ను తిరస్కరించింది అమెరికా.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.