ETV Bharat / international

ఆగని దాడులు.. రష్యా చేజారిన న్యూక్లియర్ ప్లాంట్- భారీగా సైనికులు మృతి - రష్యా ఉక్రెయిన్ తాజా వార్తలు

Russia Ukraine War 10th Day: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర పదోరోజూ కొనసాగింది. పౌరుల తరలింపునకు వీలుగా వోల్నోవఖ, మరియుపోల్‌లో కొన్నిగంటలు కాల్పుల విరమణ పాటించిన రష్యా మిగతా చోట్ల దాడులు కొనసాగించింది. కీలక నగరాలను రష్యా సేనలు చుట్టుముట్టగా... ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. పుతిన్‌ సేనలు స్వాధీనం చేసుకున్న జపోరిజియాను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. మరోవైపు, రెండుదేశాల మధ్య మూడోవిడత శాంతిచర్చలు ఆదివారం జరగనున్నాయి.

RUSSIA UKRAINE WAR 10TH DAY
RUSSIA UKRAINE WAR 10TH DAY
author img

By

Published : Mar 5, 2022, 8:41 PM IST

Russia Ukraine War 10th Day: ఉక్రెయిన్‌పై యుద్ధభేరి మోగించిన రష్యా పదోరోజు దాడులు చేసింది. రాజధాని కీవ్‌తోపాటు పలు నగరాలపై మాస్కో సేనలు దండెత్తాయి. దక్షిణ ప్రాంతంలోని నగరాలపై పట్టు కోసం శక్తివంతమైన ఆయుధాలు వాడుతున్నట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌.. ఈ తెల్లవారుజామున వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. ఖార్కివ్, చెర్నిహివ్‌, మరియుపోల్, సుమీ నగరాలను పుతిన్‌ సేనలు చుట్టుముట్టాయి. సముద్ర తీరంతో ఉక్రెయిన్‌కు సంబంధాలు లేకుండా చేసే లక్ష్యంతో తీర ప్రాంత నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.

RUSSIA UKRAINE WAR 10TH DAY
ఉక్రెయిన్​లో ధ్వంసమైన బ్రిడ్జి కింద తలదాచుకున్న ప్రజలు
RUSSIA UKRAINE WAR 10TH DAY
కీవ్ నుంచి లివీవ్ నగరానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్​లో ఉక్రెయిన్ ప్రజలు

ఈటీవీ భారత్​కు లైవ్ దృశ్యాలు

Russia attacking Ukraine live visuals: రాజధాని కీవ్‌ నగరంపై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. నివాస ప్రాంతాలను కూడా లక్ష్యం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు 'ఈనాడు- ఈటీవీ భారత్​'కు అందాయి. ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు వడీం ఇచెంకో ఫోటోలు, వీడియోల ద్వారా తమదేశంలో రష్యా దాడుల తీవ్రతను బయటి ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, ఫొటోలను చూసేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ప్రతిఘటన...

క్రెమ్లిన్ దాడులను ఉక్రెయిన్ బలగాలు గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయి. రష్యా సేనలకు ఆహారం, నీరు అందకుండాచేసే.. వ్యూహం అమలు చేస్తున్నాయి. మాస్కో బలగాల నుంచి జపోరిజియా అణువిద్యుత్‌ కేంద్రాన్ని తిరిగి కైవసం చేసుకున్నాయి. మరియుపోల్‌ను రష్యా బలగాలు దిగ్బంధించాయన్న మేయర్.. ఆక్రమణదారుల నుంచి తమ నగరాన్ని కాపాడేందుకు తమ బలగాలు పోరాడుతున్నట్లు వెల్లడించారు. ఒడెసాలోనూ రష్యా సైన్యానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.

RUSSIA UKRAINE WAR 10TH DAY
'రష్యా దాడులు ఆపితే యుద్ధం ఆగుతుంది.. ఉక్రెయిన్ పోరాటం ఆపితే ఉక్రెయినే ఉనికి కోల్పోతుంది' అన్న ప్లకార్డుతో లండన్​లో ఓ మహిళ
RUSSIA UKRAINE WAR 10TH DAY
యుద్ధం ఆపి శాంతి నెలకొల్పాలని ఇటలీలోని రోమ్​లో ప్రదర్శన

మాతృభూమి రక్షణ కోసం విదేశాల్లో ఉన్న 66,224 మంది స్వదేశానికి వచ్చినట్లు ఉక్రెయిన్‌ రక్షణమంత్రి తెలిపారు. తమ సేనలు జనావాసాలపై కూడా దాడులు చేస్తున్నాయన్న వార్తలు నకిలీవని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. జర్మనీ ఛాన్సలర్ స్కోల్జ్‌తో ఫోన్‌లో మాట్లాడిన పుతిన్‌ కీవ్‌సహా ప్రధాన నగరాలపై వైమానిక దాడుల వార్తలు నకిలీవని పేర్కొన్నట్లు క్రెమ్లిన్ తెలిపింది.

RUSSIA UKRAINE WAR 10TH DAY
ఇర్పిన్ నది దాటేందుకు పౌరులకు సహకరిస్తున్న ఉక్రెయిన్ సైనికులు
RUSSIA UKRAINE WAR 10TH DAY
స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తిని చూసుకుంటున్న ఉక్రెయిన్ సైనికులు

పది వేల మంది రష్యా సైనికులు మృతి

రష్యా సేనలు జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 28 మంది చిన్నారులు మరణించారని, మరో 840 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ వెల్లడించింది. ప్రతిదాడుల్లో 10 వేల మంది మాస్కో సేనలు చనిపోయినట్లు పేర్కొంది. రష్యాకు చెందిన 269ట్యాంకులు, 945 సాయుధ వాహనాలు, 105 శతఘ్ని వ్యవస్థలు, 50 మల్టీపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్‌లు, 39 యుద్ధ విమానాలు, 40 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 409 మోటారు వాహనాలు, రెండు స్పీడ్ బోట్లు, 3 యూఏవీలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

RUSSIA UKRAINE WAR 10TH DAY
సరిహద్దు దాటి వెళ్లేందుకు ప్రజలకు ఉక్రెయిన్ సైనికుల సహకారం
RUSSIA UKRAINE WAR 10TH DAY
ఉక్రెయిన్ సరిహద్దు దాటి పోలాండ్​కు చేరుకున్న శరణార్థులు

తగ్గిన దాడులు..

మునుపటితో పోల్చితే గత 24గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తగ్గినట్లు బ్రిటన్‌ తెలిపింది. గగనతల, శతఘ్ను దాడులను తగ్గించినట్లు ట్వీట్‌ చేసింది. రష్యాలో ఉన్న తమ దేశస్థులు అక్కడి నుంచి వచ్చే అంశాన్ని పరిశీలించాలని బ్రిటన్‌ కోరింది.

యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ 14లక్షల 50 వేల మంది ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లినట్లు ఐరాస ప్రకటించింది.

మూడో విడత చర్చలు

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య మూడో విడత చర్చలు ఆదివారం జరగనున్నాయి. ఉక్రెయిన్‌లో శాంతి కోరుకునే ప్రతిఒక్కరితో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నట్లు మాస్కో స్పష్టంచేసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.