ETV Bharat / international

రష్యా క్షిపణి పరీక్షలు.. ఉక్రెయిన్​ సరిహద్దులో హైటెన్షన్​ - రష్యా

Russia Ukraine Crisis: ఉక్రెయిన్​ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిన రష్యా.. తాజాగా సైనిక ప్రయోగాలు​ చేపట్టింది. ఆ దేశంపై ఏ క్షణమైనా యుద్ధానికి దిగుతుందనే భయాల నేపథ్యంలో హైపర్​ సోనిక్​ బాలిస్టిక్​ క్షిపణి పరీక్షలు చేపట్టటం ఆందోళన పెంచుతోంది. మరోవైపు.. రష్యా అనుకూల తిరుగుబాటుదారులు తమ సైనిక బలగాలను సమీకరిస్తుండటం గమనార్హం.

Russia Ukraine Crisis
రష్యా క్షిపణి పరీక్షలు
author img

By

Published : Feb 19, 2022, 7:25 PM IST

Updated : Feb 19, 2022, 8:01 PM IST

రష్యా క్షిపణి పరీక్షలు.. ఉక్రెయిన్​ సరిహద్దులో హైటెన్షన్​

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌తో ఏ క్షణమైనా యుద్ధానికి దిగుతుందని భావిస్తున్న వేళ.. రష్యా హైపర్‌ సోనిక్‌ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలను నిర్వహించడం కలకలం రేపుతోంది. బెలారస్‌తో కలిసి సైనిక ప్రయోగాలు నిర్వహిస్తున్న రష్యా.. క్రూయిజ్‌ క్షిపణులు, అణ్వాయుధ సామర్ధ్యం గల బాలిస్టిక్‌ క్షిపణులను కూడా ప్రయోగించింది. అన్ని క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు రష్యా వెల్లడించింది. TU-95 యుద్ధ విమానాలు, జలాంతర్గాముల ప్రయోగాలు కూడా నిర్వహించినట్లు తెలిపింది.

బలగాలను సమీకరిస్తున్న ఉక్రెయిన్​ రెబల్స్​..

తూర్పు ఉక్రెయిన్​లో వేర్పాటువాద నేతలు తమ సైనిక బలగాలను సమీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు పెరిగిపోతుండటం, వాటిని రష్యా అవకాశంగా మలుచుకోనుందనే భయాల నేపథ్యంలో ఈ ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉక్రెయిన్​లోని డొనెట్​స్క్​ ప్రాంతంలోని రష్యా అనుకూల వేర్పాటువాద ప్రభుత్వ అధినేత డెనిస్​ పుషిలిన్​.. బలగాలను సమీకరించాలని, మిలిటరీ కార్యాలయాల్లో హాజరుకావాలని ఓ ప్రకటన జారీ చేశారు. మరోవైపు.. లుహాన్​స్క్​ ప్రాంతంలోని మరో వేర్పాటువాద నేత లియోనిడ్​పసెచ్​నిక్​ ఇలాంటి ప్రకటనే చేశారు. ఉక్రెయిన్​ బలగాలను నుంచి ముప్పు పొంచి ఉందన్నారు. అయితే, ఈ వాదనలను తోసిపుచ్చిన ప్రభుత్వం.

బైడెన్​ హెచ్చరిక..

రష్యా ఒకవేళ దాడికి పాల్పడితే అత్యంత తీవ్ర స్థాయిలో ఆర్థిక, దౌత్యపరమైన చర్యలు ఉంటాయని బైడెన్ హెచ్చరించారు. తన కార్యాచరణపై పుతిన్ పునరాలోచించుకోవాలని సూచించారు. ఆక్రమణకు తగిన మూల్యం చెల్లించేలా అమెరికా, ఐరోపా దేశాలు సంయుక్తంగా పనిచేస్తాయని చెప్పారు. "పూర్తిస్థాయి ఆక్రమణపై రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గతకొద్దిరోజులుగా అమెరికా నిఘా వర్గాలు భావించాయి. అయితే, ఇప్పుడు ఆ అంచనాలు మారిపోయాయి. పుతిన్ (ఆక్రమణపై) నిర్ణయం తీసుకున్నారని నేను నమ్ముతున్నా. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది జరగొచ్చు. అమెరికా, ఐరోపాలోని మిత్ర పక్షాలు ఇదివరకు ఎన్నడూ లేనంత ఐకమత్యంతో ఉన్నాయి. దాడికి రష్యా తగిన మూల్యం చెల్లించేలా చేస్తాయి." అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై తొలగని యుద్ధమేఘాలు

Last Updated : Feb 19, 2022, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.