ETV Bharat / international

నిరసనలతో అట్టుడికిన రష్యా- 850మంది అరెస్ట్​

author img

By

Published : Jan 23, 2021, 8:48 PM IST

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపట్టారు ఆయన మద్దతుదారులు. తీవ్ర చలిని కూడా లెక్క చేయకుండా నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో 850మంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

Russia arrests 350 protesters demanding Navalny's release
ఆందోళనలతో అట్టుడుకుతున్న రష్యా- 350మంది అరెస్టు

రష్యాలోని ప్రధాన నగరాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావెల్నీని జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. తీవ్రమైన​ చలిని కూడా లెక్క చేయకుండా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన చేశారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు.

ఆందోళనలతో అట్టుడుకుతున్న రష్యా

350 మంది అరెస్ట్​

నావెల్నీ మద్దతుదారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొన్ని చోట్ల వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో మాస్కో, సెర్బియా, నోవోసిబిర్సిక్​, యెకాటెరిన్బర్గ్​, యుజ్నో-సఖాలిన్​స్క్ సహా పలు​ నగరాల్లో 850మంది నిరసనకారుల్ని అరెస్టు చేశారు పోలీసులు.

నిరసనకారుడిని అరెస్టు చేస్తున్న పోలీసులు

ప్రదర్శనకారుల్ని నిలువరిస్తున్న భద్రత సిబ్బంది

ఆందోళనలో పాల్గొన్న వేలాది మంది నావల్ని మద్దతుదారులు

వచ్చేనెలలో కోర్టు ముందుకు నావల్ని

2014లో ఆర్థిక దుశ్చర్యలను ప్రేరేపించారన్న కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు నావెల్నీ. గతేడాది విషప్రయోగానికి గురై జర్మనీలో చికిత్స పొంది.. ఇటీవల స్వదేశానికి వచ్చిన నావెల్నీని ఈ నెల 17న పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

ఇదీ చూడండి: రష్యా ప్రతిపక్ష నేత అనుచరురాలు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.