వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా.. తాము అభివృద్ధి చేస్తోన్న కొవిడ్ టీకా(covid vaccine) త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సనోఫి అండ్ గ్లాక్సోస్మిత్‌క్లైన్ (Sanofi and GlaxoSmithKline) సంస్థ పేర్కొంది. ఈ మేరకు అమెరికా, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని 35,000 మంది వలంటీర్లపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నట్లు గురువారం స్పష్టం చేసింది.
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన మొదటి వైరస్ వేరియంట్, వూహాన్ నుంచి వ్యాపించిన ఒరిజినల్ వైరస్ వేరియంట్‌పై పనిచేసేలా టీకాను అభివృద్ధి చేస్తున్నట్లు ఔషధ తయారీ సంస్థ తెలిపింది. టీకా సమర్థవంతంగా పనిచేస్తే.. ఈ ఏడాది చివరి మూడు నెలల్లో వ్యాక్సిన్‌ను వినియోగానికి అనుమతించాలని పేర్కొంది. త్వరలోనే టీకా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
కొవిడ్‌పై తమ టీకా సమర్థంగా పనిచేస్తుందని సనోఫి సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. తమ టీకా తొలి దశ క్లినికల్ ట్రయల్స్ అనంతరం.. యువతలో ఇమ్యూనిటీ పెరిగినట్లు పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీలు అభివృద్ధి అవుతున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:Covid effect: కరోనాను జయించినా.. ఆ స్కాన్ చేస్తేనే!