ఐరోపాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉత్తరాఫ్రికా నుంచి వేడిగాలులు వీస్తుండటం వల్ల ఐరోపా అంతటా ఉష్టోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. వేడిగాలులకు స్పెయిన్‌లో ఇద్దరు మృతిచెందారు.
2003లో 15వేల మంది మృతి
2003 ఆగస్టులో ఒక్క ఫ్రాన్స్‌లోనే అత్యధికంగా 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ సమయంలో సుమారు 15వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
వేడి నుంచి ఉపశమనం కోసం
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వేడి తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి అనేక మంది ఈఫిల్ టవర్ సమీపంలోని నీటి కొలనును ఆశ్రయించారు. చిన్నారులు ఎంతో ఆహ్లాదంగా గడిపారు. ఇతర ప్రాంతాల్లో ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ చూడండి: చంద్రుని శిలలపై నాసా పరిశోధనలు