స్వీడన్లోని వెట్లాండ పట్టణంలో ఓ ఆగంతుకుడు జరిపిన గొడ్డలి దాడిలో 8 మంది గాయపడ్డారు. అతడిపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. ఈ దాడి వెనక ఉగ్రకోణం ఉందా అనే అంశంపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తి ఉద్దేశం తెలియదని స్వీడన్ పోలీసులు తెలిపారు.
బుధవారం జరిగిన ఈ ఘటనను స్వీడన్ ప్రధాని స్టీఫన్ లోఫ్వెన్ ఖండించారు. దాడి నేపథ్యంలో ఘటన జరిగిన ప్రాంతంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.