ETV Bharat / international

అంపన్​ విధ్వంసంపై మోదీకి మెక్రాన్​ సంఘీభావం

author img

By

Published : Jun 4, 2020, 6:57 PM IST

Updated : Jun 4, 2020, 7:18 PM IST

ఒడిశా, బంగాల్​ రాష్ట్రాలను వణికించిన అంపన్​ తుపాను విధ్వంసంపై ప్రధాని మోదీకి ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​ సంఘీభావం తెలిపారు. తుపానులో నష్టపోయిన వారికి సాయం అందించేందుకు భారత్​కు ఫ్రాన్స్​ మద్దతుగా ఉంటుందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Macron expresses solidarity with PM over death, destruction in cyclone Amphan
తుపాను విధ్వంసంపై ప్రధానికి ఫ్రాన్స్​ అధ్యక్షుడు లేఖ

ఇటీవలే బంగాల్​, ఒడిశా రాష్ట్రాల్లో అలజడి సృష్టించిన అంపన్​ తుపాను వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను సృష్టించిన విధ్వంసంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్ తాజాగా​ ప్రధాని మోదీకి సంఘీభావం తెలిపారు.

తుపాను కారణంగా నష్టపోయిన వారికి సాయం అందించేందుకు భారత్​కు.. ఫ్రాన్స్​ మద్దతుగా ఉంటుందని ప్రధానికి రాసిన లేఖలో మెక్రాన్​ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని ఈ లేఖలో ఉద్ఘాటించారు ఫ్రాన్స్​ అధ్యక్షుడు.

భారత్​లో.. ఆర్థికంగా బలహీనమైన వారిని ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంక్​​కు చేయూతగా నిలిచే విధంగా ఓ ప్రణాళికను రూపొందిస్తోంది ఫ్రాన్స్​. ఇందులో భాగంగా 200 మిలియన్​ యూరోల రాయితీ రూణాల్ని మంజూరు చేసేందుకు సన్నద్ధమవుతోంది..

కోట్ల నష్టం...

మే 20న తీరం దాటిన అంపన్​ తుపాను.. బంగాల్​, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. బంగాల్​ రాష్ట్రంలో ఏకంగా 98 మందిని బలితీసుకుంది. దాదాపు ఆరు కోట్ల మందిపై తుపాను ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు.

Last Updated : Jun 4, 2020, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.