ETV Bharat / international

బ్రిటన్​లో గాంధీ విగ్రహానికి బోర్డులతో రక్షణ

నిరసనకారుల నుంచి కాపాడేందుకు బ్రిటన్​ పార్లమెంటులోని ప్రముఖుల విగ్రహాలను బోర్డులతో కప్పేశారు. ఇందులో బ్రిటన్​ మాజీ ప్రధాని విన్​స్టన్​ చర్చిల్​తోపాటు మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా విగ్రహాలు కూడా ఉన్నాయి. గతవారం జరిగిన ఘర్షణల్లో విగ్రహాలపై గ్రాఫిటీ వేసేందుకు బ్లాక్​ లైవ్స్ మ్యాటర్​ ఉద్యమకారులు ప్రయత్నించారు. ఈ వారాంతంలో మళ్లీ నిరసనలు చెలరేగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

UK-STATUES-LD PROTEST
గాంధీ విగ్రహం
author img

By

Published : Jun 12, 2020, 8:44 PM IST

Updated : Jun 12, 2020, 9:04 PM IST

లండన్​లోని పార్లమెంటు స్క్వేర్​లోని ప్రముఖుల స్మారకాల్లో ఒకటైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని బోర్డులతో కప్పేశారు. అఫ్రికన్​- అమెరికన్​ జార్జి ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనల నేపథ్యంలో విగ్రహాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం.

పార్లమెంటు స్క్వేర్​లోని గాంధీ, బ్రిటన్ మాజీ ప్రధాని విన్​స్టన్ చర్చిల్​ విగ్రహాల సమీపంలో బ్లాక్​ లైవ్స్ మ్యాటర్​ ఉద్యమకారులు నిరసన చేపట్టారు. రంగులు పూసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవటం వల్ల ఘర్షణ చెలరేగింది.

వారి విగ్రహాలతో పాటు..

ఈ వారాంతంలోనూ జాత్యంహకార వ్యతిరేక బృందాలు, మితవాద సంఘాలు నిరసనలకు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితులు ఘర్షణలకు దారితీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విగ్రహాల సంరక్షణకు లండన్​ పరిపాలన విభాగం సిద్ధమయింది.

"సెనోటాఫ్, విన్​స్టన్​ చర్చిల్​, నెల్సన్ మండేలా విగ్రహాలకు ముప్పు పొంచి ఉంది. అందుకే వీటిని బోర్డుల​తో కప్పేశాం. వీటిల్లో మహాత్మాగాంధీ విగ్రహం కూడా ఉంది."

- సాదిక్ ఖాన్​, లండన్ మేయర్​

గాంధీ విగ్రహం సమీపంలో 'రేసిస్ట్​' అనే పదం రాయటంపై భారతీయ సంఘాలు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫలితంగా లీచెస్టర్​ నగరంలోనూ గాంధీ విగ్రహాన్ని తొలగించాలని పిటిషన్ దాఖలైంది.

చర్చిల్​ విగ్రహం లక్ష్యంగా..

పార్లమెంటులో విన్​స్టన్​ చర్చిల్ విగ్రహం లక్ష్యంగా నిరసనకారులు రంగులు పూసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​ అసంతృప్తి వ్యక్తం చేశారు.

"పార్లమెంటులోని చర్చిల్​ విగ్రహం.. ఆయన సాధించిన విజయాలకు ప్రతిరూపం. ఫాసిజం, జాత్యంహకార నిరంకుశత్వం నుంచి బ్రిటన్​తో పాటు ఐరోపానూ కాపాడారు. ఇలాంటి జాతీయ స్మారక చిహ్నానికి నేడు హింసాత్మక నిరసనకారుల నుంచి ప్రమాదం ఏర్పడటం బాధాకరం. అవును, ఆయన కొన్నిసార్లు మనకు ఆమోదయోగ్యం కాని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ. ఆయన ఒక హీరో. తన స్మారక చిహ్నానికి చర్చిల్​ పూర్తిగా అర్హులు. నిరసనలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నా."

- బోరిస్ జాన్సన్​, బ్రిటన్ ప్రధాని

ఇదీ చూడండి: 'ఫ్లాయిడ్ మరణం ప్రపంచాన్ని మారుస్తోంది'

Last Updated : Jun 12, 2020, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.