మానవ ముక్కులోని రెండు రకాల కణాలు కరోనా వైరస్‌కు ప్రవేశ ద్వారాలుగా వ్యవహరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రిటన్‌లోని వెలకమ్ సాగర్ ఇన్స్టిట్యూట్, నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ మెడికల్ సెంటర్ గ్రొనిన్జెన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఏసీఈ-2, టీఎంపీఆర్ఎస్ఎస్2 ప్రొటీజ్ అనే ప్రోటీన్లు కరోనా వైరస్ ప్రవేశానికి వీలుకల్పిస్తున్నాని గుర్తించారు.
ముక్కు లైనింగ్ మీదున్న కణాలతో సహా వివిధ అవయవాల్లో ఇవి ఉన్నాయి. అయితే శ్వాసనాళాల్లోని ఇతర కణాలతో పోలిస్తే ముక్కులోని గోబ్లెట్ కణాలు, సీలియేటెడ్ కణాల్లో ఈ రెండు రకాల ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పరిశోధనలో పాల్గొన్న వారాడన్ సుంగ్నాక్ తెలిపారు. దీంతో మానవ శరీరంలోకి ప్రవేశించడానికి వైరస్‌కు ఇవి ప్రాథమిక ఇన్ఫెక్షన్ మార్గాలుగా ఉపయోగపడుతున్నట్లు చెప్పారు.