ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఉపఎన్నికల్లో భారత సంతతి విద్యార్థిని అన్వీ భుటానీ ఘన విజయం సొంతం చేసుకుంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి జరిగిన ఈ ఎన్నికల్లో.. ఆక్స్‌ఫర్డ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా గెలుపొందింది. ఒక భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇది రెండోసారి.
గత ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన భారత విద్యార్థిని రష్మీ సమంత్ చేసిన కొన్ని సామాజిక మాధ్యమాల పోస్ట్‌లు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆమె ఆ పదవి నుంచి వైదొలగడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆక్స్‌ఫర్డ్ విద్యార్థి సంఘాల ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఓటింగ్ నమోదవ్వడం విశేషం. అలాగే మొత్తం 11 మంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఇంత మొత్తంలో అభ్యర్థులు పోటీ చేయడం కూడా ఇదే తొలిసారి. అన్వీ ప్రస్తుతం వర్సిటీకి అనుబంధంగా ఉన్న మ్యాగ్‌డాలెన్ కళాశాలలో హ్యూమన్ సైన్సెస్‌లో పీజీ చదువుతోంది.
ఇదీ చదవండి:అత్యంత శక్తిమంతమైన గామా కిరణాల ఆవిష్కరణ!