ETV Bharat / international

కరోనాను ఎదుర్కొనే సమర్థ యాంటీబాడీలు..! - Coronavirus antibodies latest news

కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను గుర్తించారు జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు. వీటి ద్వారా కొవిడ్​-19కు సమర్థమైన​ టీకాలను అభివృద్ధి చేయడానికి వీలవుతుందని వారు తెలిపారు.

Highly effective coronavirus antibodies identified, may lead to passive COVID-19 vaccine
కరోనాను ఎదుర్కొనే సమర్థ యాంటీబాడీలు..!
author img

By

Published : Sep 26, 2020, 5:42 AM IST

కరోనా వైరస్​పై సమర్థంగా పని చేసే యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా కొవిడ్​-19కు ప్యాసివ్​ టీకాలను అభివృద్ధి చేయడానికి వీలవుతుందని వారు తెలిపారు. జర్మనీలోని సెంటర్ ఫర్​ న్యూరోడీజెనరేటివ్ డీసీజెస్​​, చారిటె-యూనివర్సిటీ టాట్​మెడిజిన్​ బెర్లిన్​ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

ప్యాసివ్ టీకాల ప్రక్రియలో.. అప్పటికే సిద్ధంగా ఉన్న యాంటీబాడీలను ఎక్కిస్తుంటారు. ఇవి కొంతకాలం తర్వాత క్షీణిస్తుంటాయి. కరోనాను నిర్వీర్యం చేసే నిర్దిష్ట యాంటీబాడీల్లో కొన్ని వివిధ అవయవాల్లోని కణజాలాలకు అతుక్కుపోతాయని... ఫలితంగా కొన్ని దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారి నుంచి దాదాపు 600 రకాల యాంటీబాడీలు వీరు సేకరించారు. వీటిలో వైరస్​పై దాడి చేసే సత్తా ఉన్న యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. సెల్ కల్చర్​ విధానం ద్వారా వీటిని కృత్రిమంగా ఉత్పత్తి చేశారు. ఇవి కరోనా వైరస్​కు అతుక్కుంటున్నాయని... తద్వారా ఆ సూక్ష్మజీవి మానవ కణంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయని తెలిపారు.

ఇదీ చూడండి: వ్యాక్సిన్‌ వినియోగానికి చైనాకు అనుమతిచ్చిన డబ్ల్యూహెచ్​ఓ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.