ETV Bharat / international

శునకంతో.. పులిబిడ్డకు దోస్తీ కుదిరింది!

స్నేహానికి కుల, మత, జాతి భేదాలుండవు. ఇది జంతువులకు కూడా వర్తిస్తుంది. చిన్న చిరునవ్వుతోనే బద్ధ శత్రువులను సైతం ప్రాణమిత్రులుగా మార్చేయొచ్చని మరోసారి నిరూపించాయి రెండు జంతువులు. అవును, రష్యాలో క్రూర మృగ జాతికి చెందిన ఓ పులి పిల్ల, పెంపుడు జంతువైన శునకంతో దోస్తీ చేసింది. అదెలా సాధ్యమైంది అంటారా? అయితే ఈ కథ చదివేయండి!

Hand-reared tiger cub befriends Russia zoo's dog
శునకంతో.. పులిబిడ్డకు దోస్తీ కుదిరింది!
author img

By

Published : Jun 18, 2020, 6:14 PM IST

రష్యాలోని నిజ్ని నోవ్​గార్డ్​లో మడగాస్కర్​ జూకు చెందిన చిన్నారి పులి పిల్ల.. అదే జూలోని ఓ శునకంతో చెలిమి చేసింది. ఈ బుజ్జి పులిపిల్ల, దాని ఇద్దరు సోదరులు ఏప్రిల్​లో పురుడు పోసుకున్నాయి. ​కానీ వాటి తల్లి వాటిని వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు జూ సిబ్బంది. మేకపాలలో ప్రొటీన్లు, ఇతర పోషకాలు కలిపి వాటికి పట్టిస్తున్నారు. చిన్నచిన్నగా మాంసాహారం అలవాటు చేస్తున్నారు.

కానీ, కొద్ది రోజుల క్రితమే వీటిలో రెండు పులిపిల్లలను ఇతర జూలకు పంపించేశారు సిబ్బంది. దీంతో ఈ బుజ్జి పులిపిల్ల ఒంటరైపోయింది. తన మనసులోని భారాన్ని అర్ధం చేసుకున్న జూ సిబ్బంది.. పెంపుడు కుక్క లీలూని ఆ పులిపిల్లకు దగ్గర చేశారు. కొద్ది రోజుల్లోనే ఆ రెండింటి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది.

శునకంతో.. పులిబిడ్డకు దోస్తీ కుదిరింది!

ఇక ఇప్పుడు రెండు భిన్న జాతులకు చెందిన జంతువులు ఏ భేదభావం లేకుండా సరదాగా ఆడుకుంటున్నాయి. ఈ పులి,శునకం స్నేహాన్ని చూసి పర్యటకులు మురిసిపోతున్నారు.

Hand-reared tiger cub befriends Russia zoo's dog
శునకంతో.. పులిబిడ్డకు దోస్తీ కుదిరింది!

ఇదీ చదవండి:కన్న బిడ్డను చూడకుండానే యోధుడి వీర మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.