మాజీ సోవియట్ దేశం జార్జియాలో ఓ అగంతుకుడు కలకలం సృష్టించాడు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఆ దుండగుడు.. అక్కడి జుగ్-డిడి ప్రాంతంలోని ఓ బ్యాంకులో చొరబడి విధ్వంసం సృష్టించాడు. అంతేకాకుండా పలువురు ఉద్యోగులు, ఖాతాదారులను అదుపులోకి తీసుకొన్నాడు. అతడి చేతిలో గన్ చూసిన ఖాతాదారులు.. భయంతో నేలపై సాగిలపడిపోయారు.
అగంతుకుడు బ్యాంకులో 19 మందిని బందీలుగా చేసుకొని చర్చల అనంతరం 16 మందిని విడిచిపెట్టాడు. రక్షణ కోసం ముగ్గురిని తన వెంట తీసుకువెళ్లి.. తర్వాత వారిని కూడా విడిచిపెట్టాడు. దుండగుడు 5లక్షల డాలర్లు డిమాండ్ చేసినట్లు జార్జియా టీవీ ఛానెళ్లు తెలిపాయి. దుండగుడు ఎవరన్నది తెలియరాలేదు.