ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 3.40 కోట్లకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3.40 కోట్లకు చేరువైంది. ఇప్పటి వరకు 10.13 లక్షల మందికిపైగా వైరస్​కు బలయ్యారు. అమెరికా, భారత్​, బ్రెజిల్​, రష్యాలతో పాటు కొలంబియా, పెరూ దేశాల్లో వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది.

Global COVID-19
ప్రపంచ దేశాలపై కరోనా పంజా
author img

By

Published : Sep 30, 2020, 8:54 PM IST

Updated : Sep 30, 2020, 10:34 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకూ వైరస్​ బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 3.40 కోట్లకు చేరువైంది. మరో 10.13లక్షల మందికిపైగా మరణించారు. ఇదే సమయంలో వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగటం ఊరట కలిగిస్తోంది. ఇప్పటివరకు 2.52 కోట్ల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

మొత్తం కేసులు: 33,919,912

మరణాలు: 1,013,944

కోలుకున్నవారు: 25,208,061

యాక్టివ్​ కేసులు: 7,697,907

  • అగ్రరాజ్యంలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 74 లక్షలు దాటాయి. ఇప్పటివరకు 2.10లక్షల మందికిపైగా వైరస్​కు బలయ్యారు. మొత్తం 46.5 లక్షల మంది కరోనా​ నుంచి కోలుకున్నారు.
  • నేపాల్​లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 1,559 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,817కి చేరింది. ఇవాళ ఏడుగురు వైరస్​కు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 498కి చేరింది. ఇప్పటి వరకు 56,428 మంది రికవరీ అయ్యారు.
  • రష్యాలో వైరస్​ విజృంభిస్తోంది. బుధవారం కొత్తగా 8,481 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,176,286కు చేరింది.
  • సింగపూర్​లో వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ మరో 23 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. అందులో నలుగురు విదేశీయులు ఉన్నారు. మొత్తం కేసుల సంఖ్య 57,765కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు ఇలా..

దేశంకేసులుమరణాలు
అమెరికా7,409,940210,867
బ్రెజిల్​ 4,780,317143,010
రష్యా1,176,28620,722
కొలంబియా824,04225,828
పెరు811,76832,396
స్పెయిన్​758,17231,614
మెక్సికో738,16377,163
అర్జెంటినా736,60916,519

Last Updated : Sep 30, 2020, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.