ETV Bharat / international

'2022 జూలై నాటికి 70శాతం మందికి వ్యాక్సినేషన్'

author img

By

Published : Nov 1, 2021, 5:46 AM IST

ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ జనాభాలో 40శాతం మందికి వ్యాక్సిన్​ అందించాలని జీ20 దేశాలు(G20 Summit 2021 News) తీర్మానించాయి. కరోనా టీకాల అభివృద్ధిని వేగవంతం చేయాలని నిర్దేశించాయి.

G-20 nations
జీ20

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో.. కరోనా టీకాల అభివృద్ధిని వేగవంతం చేయాలని జీ20 దేశాలు(G20 Summit 2021) నిర్దేశించాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ జనాభాలో 40శాతం మందికి వ్యాక్సిన్​ అందించాలని తీర్మానించాయి. 2022 జూలై నాటికి 70శాతం మందికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ క్రమంలో కొవిడ్​-19ను ముందుండి పోరాడిన వైద్య సిబ్బంది, అంతర్జాతీయ సంస్థలు, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు

జీ20(G20 Summit 2021 News) దేశాధినేతలు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్​ అందించాలని అభిప్రాయపడ్డారు. ఆహార భద్రతను సాధించాలని, అందరికీ పౌష్టికాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జీవవైవిధ్య నష్టాన్ని 2030 వరకు తగ్గించాలని తీర్మానించాయి.

త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ సదుపాయాలు సజావుగా ప్రారంభం కావాలని ఆకాంక్షించాయి. జీ20 సమావేశంలో 2022లో ఇండోనేసియాలో, 2023లో భారత్​, 2024లో బ్రెజిల్​లో జరగనుంది.

ఇదీ చదవండి: 'డబ్ల్యూహెచ్​ఓ బలోపేతానికి జీ20 దేశాల అంగీకారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.