తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. దీంతో తాలిబన్ల చెరలో బతకలేమని భావించిన ప్రజలు దేశాన్ని వీడుతున్నారు. ప్రభుత్వ అధికారులు సైతం విదేశాల బాటపట్టారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ఓ మాజీ మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాదత్ చేస్తున్న పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో సమాచార సాంకేతిక శాఖ మంత్రిగా పని చేసిన సయ్యద్ ప్రస్తుతం జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆయన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
-
Vor ein paar Tagen lernte ich einen Mann kennen, der behauptete, vor zwei Jahren afghanischer Kommunikationsminister gewesen zu sein. Ich fragte, was er in #Leipzig mache. „Ich fahre für Lieferando Essen aus.“ pic.twitter.com/nafutTTXqP
— Josa Mania-Schlegel (@JosaMania) August 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Vor ein paar Tagen lernte ich einen Mann kennen, der behauptete, vor zwei Jahren afghanischer Kommunikationsminister gewesen zu sein. Ich fragte, was er in #Leipzig mache. „Ich fahre für Lieferando Essen aus.“ pic.twitter.com/nafutTTXqP
— Josa Mania-Schlegel (@JosaMania) August 21, 2021Vor ein paar Tagen lernte ich einen Mann kennen, der behauptete, vor zwei Jahren afghanischer Kommunikationsminister gewesen zu sein. Ich fragte, was er in #Leipzig mache. „Ich fahre für Lieferando Essen aus.“ pic.twitter.com/nafutTTXqP
— Josa Mania-Schlegel (@JosaMania) August 21, 2021
మంత్రి పదవికి రాజీనామా..
2018లో సమాచార, సాంకేతిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సయ్యద్.. రెండేళ్లు ఆ పదవిలో కొనసాగారు. కొన్ని కారణాల దృష్ట్యా 2020లో మంత్రి పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత జర్మనీకి వెళ్లిపోయినట్లు అరబిక్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. జర్మనీలోని లీప్‌జిగ్‌లో సైకిల్‌పై పిజ్జా డెలివరీ చేస్తున్నట్లు, గతంలో మంత్రిగా పని చేసిన ఫొటోలను ట్వీట్ చేశాయి.
సయ్యద్.. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీలు పూర్తి చేసినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది.
ఇదీ చూడండి: Afghan Crisis: 'ఉగ్రవాదులకు అఫ్గాన్ ఆశ్రయం ఇవ్వొద్దు'