ETV Bharat / international

భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా ఫ్రాన్స్​లో నిరసన జ్వాలలు

ఫ్రాన్స్​లో ప్రతిపాదిత భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నలుపు రంగు వస్త్రాలు ధరించిన వేలాది నిరసనకారులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అనేక చోట్ల హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పలుచోట్ల వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ నిరసనల్లో 22 మందిని అధికారులు అరెస్టు చేశారు.

Fires could be seen on the streets in Paris on Saturday as thousands protested
భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా ఫ్రాన్స్​లో నిరసన జ్వాలలు
author img

By

Published : Dec 6, 2020, 5:30 AM IST

పోలీసుల ఫొటోలు, వీడియోలను చిత్రీకరించకూడదని ఫ్రాన్స్​ ప్రతిపాదించిన వివాదాస్పద బిల్లుపై ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. వేలాది మంది బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు. అనేక కార్లకు నిప్పంటించారు. ఓ బ్యాంకుపై దాడి చేసి ఫర్నీచర్​ను ధ్వంసం చేశారు. పత్రాలను కాల్చేశారు. నిరసనలను అడ్డుకున్న పోలీసులపైకి వస్తువులను విసిరారు. ఓ ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశారు.

భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా ఫ్రాన్స్​లో నిరసన జ్వాలలు

నలుపు రంగు వస్త్రాలు ధరించి నిరసనకారులు భారీ ర్యాలీ​ నిర్వహించారు. వీరిని నిలువరించడానికి జాత్యహంకార ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారుల్లో 22 మందిని అరెస్టు చేశామని ఫ్రాన్స్​​ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్​ డర్మానిన్ తెలిపారు.

జాత్యహంకార వైఖరిని అవలంబిస్తున్న పోలీసు అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​ చెప్పారు. పోలీసుల దుష్ప్రవర్తనపై ఫిర్యాదు చేయడానికి ఓ ఆన్​లైన్​ వేదికను తీసుకువస్తామని తెలిపారు.

Fires could be seen on the streets in Paris on Saturday as thousands protested
బ్యాంకు ఫర్నీచర్​ను ధ్వంసం చేస్తున్న నిరసనకారులు

ఫ్రాన్స్​ నిరసనల్లో దగ్ధమవుతోన్న కారు

వేలాది నిరసనకారుల మార్చ్​

భారీగా మోహరించిన ఫ్రాన్స్​ పోలీసులు

భద్రతా బిల్లును ఫ్రాన్స్​ ప్రభుత్వం గతవారం ప్రతిపాదించింది. ఈ బిల్లు ద్వారా పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని విమర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల క్రూరత్వాన్ని బహిర్గతం చేయడం కష్టంగా మారుతుందని అంటున్నారు.

మిచెల్ జెక్లర్‌ అనే ఓ నల్ల జాతీయుడైన మ్యూజిక్​ ప్రొడ్యూసర్​ను అధికారులు కొట్టే వీడియో గత నెలలో వెలువడింది. తద్వారా ఆ అధికారులపై దర్యాప్తు జరగగా.. వారిలో ఇద్దరు అధికారులు జైలు పాలయ్యారు. ఈ నేపథ్యంలో తాజా బిల్లును ప్రతిపాదించింది ఫ్రాన్స్​ ప్రభుత్వం.

ఇదీ చూడండి:అఫ్గాన్​ సైనిక దాడిలో 25మంది ఉగ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.