రష్యా రాజధాని మాస్కోలో అగ్ని ప్రమాదం జరిగింది. కరోనా వైరస్ సోకినవారికి చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కరోనా రోగి ఒకరు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 200 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదం నుంచి కాపాడిన కరోనా రోగులను మరో ఆస్పత్రికి తరలించినట్లు నగర మేయర్ వెల్లడించారు.