ఐరోపా ఆల్ప్ పర్వతాల్లో డేగకు అమర్చిన కెమెరా వాతావరణంలో మార్పు, భూతాపం వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని కళ్లకు కట్టింది.
విక్టర్ అనే డేగ ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తుందో తెలుసుకునేందుకు దాని రెక్కల నడుమ ఓ కెమెరా అమర్చారు పరిశోధకులు. పక్షులు ఎలాంటి ప్రకృతిని ఇష్టపడతాయో తెలుసుకునే ప్రయత్నంలో ఓ చేదు నిజం వెలుగులోకి వచ్చింది. ఆల్ప్ పర్వతాల్లో విహరించిన ఆ పక్షి కళ్లతో చూసిన దృశ్యాలు ఎంత మనోహరంగా ఉన్నాయో, అవి కనుమరుగైపోతాయన్న వాస్తవం అంత కఠినంగా ఉంది.
ఒకప్పటి అద్భుతమైన హిమ పర్వతాలు.. ఇప్పుడు కరిగిపోతున్నట్లు, అసహజంగా మారుతున్నట్లు విక్టర్ కెమెరా ద్వారా తెలిసింది.
వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి సుందర ప్రదేశాలు అస్థిత్వాన్ని కోల్పోవడమే కాదు... వనాలు వాడిపోయి, నీరు ఇంకిపోయి, మానవ జీవనం అగమ్యగోచరంగా మారుతుంది. డేగ మూడో కంటితో చూపించిన ఈ దృశ్యాలు ప్రకృతిని, పక్షులనూ కాపాడుకునేందుకు సత్వర చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తునట్టున్నాయి .
ఇదీ చూడండి:'ప్లాస్టిక్' పసుపుతో మంచి ఆరోగ్యం, ఆదాయం!