ETV Bharat / international

కరోనా నిబంధనల నడుమ క్రిస్మస్​ వేడుకలు షురూ - Christmas Festival

క్రిస్మస్ వేడుకలు నిర్వహించేందుకు ప్రపంచ దేశాలు ముస్తాబవుతున్నాయి. ఆయా దేశాల్లోని రహదారులు, ప్రధాన వీధులు, పెద్ద పెద్ద భవంతులు కాంతిలీనుతున్నాయి. ప్రజలు పెద్దఎత్తున క్రిస్మస్‌ వస్తువులు కొనేందుకు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆయా దేశాల్లో పండగ రద్దీ కొంత మేర తగ్గింది.

Europe's Christmas dilemma: risk empty chairs next year?
కరోనా నిబంధనల నడుమ క్రిస్మస్​ వేడుకలు షురూ
author img

By

Published : Nov 29, 2020, 11:15 AM IST

Updated : Nov 29, 2020, 12:40 PM IST

కరోనా నిబంధనల నడుమ క్రిస్మస్​ వేడుకలు షురూ

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలకు ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. క్రిస్మస్‌ అలంకరణలతో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌ ధగధగ మెరిసిపోతోంది. 10.8 మిలియన్ల విద్యుత్‌ దీపాలతో నగరాన్ని సుందరంగా అలంకరించారు. స్పానిష్ జెండా రంగులను పోలిన విద్యుత్ కాంతులతో వీధులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పలు వీధుల్లో పెద్ద పెద్ద సెట్టింగ్‌లను ఏర్పాటు చేశారు. గ్రాన్ వయా కూడలిలో 12 మీటర్ల పెద్ద బుడగను క్రిస్మస్ చిత్రాలతో రూపొందించారు.

Christmas tree
క్రిస్మస్​ ట్రీ
Spain Capital Madrid
కాంతులీనుతున్స్పెన మాడ్రిడ్​

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్.. క్రిస్మస్ సందర్భంగా దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పారిస్‌లో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్‌ దీపాలతో అలంకరించిన నిర్మాణాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Christmas Festival
ఘనంగా క్రిస్మస్​ ఏర్పాట్లు
Europe's Christmas dilemma: risk empty chairs next year?
బెల్జియంలో క్రిస్మస్​ వేడుకలు

బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని ప్రధాన కూడలి వద్ద 18 మీటర్ల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ జర్మనీలో ప్రజలు దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఫ్రాన్స్​ ఆందోళనలు ఉద్రిక్తం.. 37 మంది పోలీసులకు గాయాలు

Last Updated : Nov 29, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.