Covid new variant: ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెడుతున్న వేళ.. ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఒమిక్రాన్ కన్నా ఎక్కువ మ్యుటేషన్లు ఉన్న సరికొత్త కొవిడ్ వేరియంట్‌ను గుర్తించారు. ఇది కామెరూన్ దేశంలో ఆవిర్భవించి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.
Dangerous variant than Omicron:
కొత్త వేరియంట్‌కు సంబంధించి.. ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌లో 12 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆఫ్రికాలోని కామెరూన్ దేశం నుంచి వచ్చిన వారిలోనే ఈ వేరియంట్ బయటపడిందని పరిశోధకులు తెలిపారు. కొత్త వేరియంట్‌కు 'ఐహెచ్‌యూ' అని పేరు పెట్టారు.
Covid 19 latest news:
మెడ్ఆర్ఎక్ఐవీ జర్నల్‌లో పోస్ట్ చేసిన పరిశోధక పత్రం వివరాల ప్రకారం.. కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో 14 అమినో యాసిడ్ సబ్స్టిట్యూషన్స్ను, మరో తొమ్మిది మ్యుటేషన్లనూ గుర్తించారు. ఎన్501వై, ఈ484కే అనే ప్రధాన మ్యుటేషన్లు సైతం ఉన్నాయని పరిశోధకులు వివరించారు.
అయితే, సాధారణంగా వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, అన్నీ ప్రమాదకరమైనవి కాకపోవచ్చని ప్రముఖ ఎపిడమాలజిస్ట్ ఎరిక్ ఫీగిల్ డింగ్ పేర్కొన్నారు. కొత్త వేరియంట్ ఏ జాబితాలోకి వస్తుందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
మరే ఇతర దేశాల్లోనూ ఈ కరోనా రకం కేసులు బయటపడలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సైతం దీన్ని ఇంకా 'వేరియంట్'గా గుర్తించలేదు.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో 18 వేలు- బంగాల్లో 9 వేల కొత్త కరోనా కేసులు