ETV Bharat / international

కరోనాతో ఫ్రాన్స్​లో ఒక్కరోజే 1,350 మంది మృతి

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే కొవిడ్​-19 ధాటికి దాదాపు 6 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్​లోనే 1350 మందికిపైగా బలయ్యారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్​, బ్రిటన్​లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.

author img

By

Published : Apr 3, 2020, 10:48 AM IST

Coronavirus cases top 1 million worldwide: AFP tally
కరోనాతో ఫ్రాన్స్​లో ఒక్కరోజే 1350 మంది మృతి

కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలు దాటాయి. గురువారం ఒక్కరోజే 79 వేల 747 కేసులు నమోదుకాగా.. 5 వేల 974 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు 10 లక్షల 15 వేలపైనే. మృతుల సంఖ్య 53 వేలు దాటింది. ఇందులో సగంకంటే ఎక్కువ మంది ఐరోపావాసులే.

24 గంటల్లో 1,350కిపైగా..

ఫ్రాన్స్​లో ఇప్పుడిప్పుడే తీవ్రరూపం దాలుస్తున్న కరోనా.. గురవారం మరణమృందం మోగించింది. 24 గంటల వ్యవధిలో అక్కడ మరో 1,355 మంది ప్రాణాలు కోల్పోవడం వైరస్​ తీవ్రతకు అద్దం పడుతోంది. మరో 2 వేలకుపైగా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 60 వేలకు చేరువైంది.

30వేల కేసులు..

కరోనా కేసుల పరంగా అమెరికాలో రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. నిన్న అక్కడ మరో 29 వేల 974 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 968 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 6 వేల 70కి చేరింది. మొత్తం కేసులు 2 లక్షల 50 వేలకు చేరువలో ఉన్నాయి.

బ్రిటన్​..

యూకేలో మరో 569 మరణాలతో మొత్తం మృతులు 2921కి చేరారు. మరో 4,244 కేసులు నమోదయ్యాయి.

ఇటలీలో గురువారం 760 మంది, స్పెయిన్​లో 961 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.

జర్మనీలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 6 వేల 813 మంది బాధితులతో మొత్తం కేసుల సంఖ్య 84 వేలు దాటింది. గురువారం అక్కడ మరో 176 మంది మరణించారు.

బెల్జియం, నెదర్లాండ్స్​లోనూ కేసులు ఎక్కువవుతున్నాయి. అక్కడ వరుసగా 183, 166 మందిని వైరస్​ బలితీసుకుంది. కేసులు వరుసగా 15 వేల 348, 14 వేల 697గా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.