ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా- 60వేలు దాటిన మరణాలు

ప్రపంచంపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ధాటికి 60వేల మందికిపైగా మృతి చెందారు. 11.33 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. అమెరికా సహా ఐరోపా దేశాల్లో నిత్యం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

CORONA
ప్రపంచంపై కరోనా పంజా
author img

By

Published : Apr 4, 2020, 6:04 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 11,33,373 మందికిపైగా ఈ వైరస్​ బారిన పడ్డారు. 60,375 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 2,35,992 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్​ వంటి దేశాల్లో నిత్యం వందలాది మంది మృత్యువాత పడుతున్నారు.

అమెరికాలో..

అమెరికాలో కరోనా వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే 2,77,533 మంది ఈ వైరస్​ బారిన పడ్డారు. 7,403 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాధి బాధితుల్లో 12, 283 మంది కోలుకున్నారు. అంతకంతకూ పెరిగిపోతున్న రోగులకు చికిత్స చేయడానికి.. అమెరికా ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది అవస్థలు పడుతున్నారు.

ఐరోపా దేశాలు కుదేలు..

కరోనా మహమ్మారి ధాటికి.. ఐరోపా దేశాలు కుదేలవుతున్నాయి. అత్యధికంగా స్పెయిన్​లో 1,24,736 మంది వైరస్​ బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 809 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 11,744కి చేరింది. 7,026 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇటలీలో 1,19,827 మంది వైరస్​ బారిన పడగా.. 14,681 మంది చనిపోయారు. జర్మనీలో 91,159 మందికి వ్యాధి సోకగా.. 1,275 మంది మృతి చెందారు.

ఆయా దేశాల్లో కరోనా వివరాలు (వరల్డ్​ఓమీటర్​ ఆధారంగా)

CORONA
ప్రపంచంపై కరోనా పంజా

ఇదీ చూడండి: 'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.