ETV Bharat / international

Mehul Choksi: ఆ దేశ ప్రతిపక్ష నేతతో సీక్రెట్ డీల్!

author img

By

Published : Jun 2, 2021, 3:39 PM IST

Updated : Jun 6, 2021, 10:40 AM IST

మెహుల్​ చోక్సీ సోదరుడు చేతన్ చినూ భాయ్ చోక్సీ.. డొమినికా ప్రతిపక్ష నేతను రహస్యంగా కలిసినట్లు సమాచారం. తన తమ్ముడిని భారత్​కు అప్పగించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే.. వచ్చే ఎన్నికలకు నిధులు సమకూర్చేలా ఇద్దరి మధ్య ఒప్పందం జరిగినట్లు అక్కడి వార్తా సంస్థ వెల్లడించింది.

Mehul Choksi
ఛోక్సీ సోదరుని రహస్య ఒప్పందం

దేశం వీడి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ సోదరుడు చేతన్​ చినూ భాయ్ ఛోక్సీ.. డొమినికా ప్రతిపక్ష నేత లెనాక్స్ లింటన్​ను రహస్యంగా కలిసినట్లు తెలుస్తోంది. పోలీసులకు చిక్కిన తన తమ్ముడిని భారత్​కు అప్పగించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరినట్లు సమాచారం. ఇలా చేస్తే వచ్చే ఎన్నికల ఖర్చుకు నిధులు సమకూర్చుతామని చేతన్​ హామీ ఇచ్చాడని, ఈ మేరకు లెనాక్స్​తో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడని స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది.

ఇదీ చూడండి: గర్ల్​ఫ్రెండ్​తో వెళ్లడమే ఛోక్సీ కొంపముంచిందా?

చోక్సీ అంశాన్ని డొమినికా పార్లమెంట్​లో లేవనెత్తాలని, అతడిని భారత్​కు అప్పగించకుండా చేయాలని చేతన్​ ప్రతిపక్ష నేతను కోరినట్లు వార్తా సంస్థ పేర్కొంది. ఇద్దరి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చ జరిగిందని తెలిపింది. మెహుల్ చోక్సీ స్వతహాగా డొమినికా చేరుకున్నాడని, కానీ అతడ్ని పోలీసులు కిడ్నాప్ చేశారని నమ్మించేలా చేసి కోర్టులో గెలిచేందుకు సహకరించాలని చేతన్​ అడిగినట్లు చెప్పింది. ఈ ఒప్పందం కోసం చేతన్ చోక్సీ మే 29న ఓ ప్రైవేటు జెట్​లో డొమినికా వెళ్లినట్లు వివరించింది.

ఇదీ చూడండి: Mehul Choksi: జైలులో గాయాలతో ఛోక్సీ- ఫొటోలు వైరల్​!

రూ.13,500 కోట్ల పంబాబ్ నేషనల్​ బ్యాంక్ కుంభకోణం కేసులో మెహుల్ చోక్సీ నిందితుడు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న అతడు మే 23న ఆంటిగ్వాలో అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. 27న పోలీసులకు చిక్కాడు. చోక్సీ అప్పగింతను తాత్కాలికంగా నిలిపివేస్తూ డొమినికా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదపరి విచారణ బుధవారం జరగనుంది.

చోక్సీ అంశంపై డొమినికా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య దుమారం చెలరేగింది.

ఇదీ చూడండి: Mehul Choksi: దిల్లీలో దిగగానే చోక్సీ అరెస్ట్​?

Last Updated : Jun 6, 2021, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.