ETV Bharat / international

జెనీవాలో ముగిసిన అమెరికా, రష్యా అధ్యక్షుల భేటీ

biden putin summit, us russia summit geneva
బైడెన్​-పుతిన్​ చర్చలు.. తొలి విడత పూర్తి
author img

By

Published : Jun 16, 2021, 8:39 PM IST

Updated : Jun 16, 2021, 11:45 PM IST

20:08 June 16

బైడెన్​-పుతిన్​ చర్చలు పూర్తి

అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య జెనీవా వేదికగా జరిగిన భేటీ ముగిసినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. సుమారు నాలుగు గంటల పాటు బైడెన్​, పుతిన్​లు చర్చించుకున్నట్లు పేర్కొంది. రెండు విడతలగా సాగిన ఈ సమావేశంలో రెండవ విడత సుదీర్ఘంగా సాగిందని తెలిపింది. ఈ భేటీ పట్ల సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకున్నా.. అమెరికా-రష్యా మధ్య బంధాలు బలహీనంగా ఉండటం వల్ల ఇరు పక్షాలు చర్చల నుంచి మెరుగైన ఫలితాలు ఆశించలేదని సమాచారం.    

షేక్​ హ్యాండ్​తో మొదలు

లేక్​సైడ్​ విల్లాకు చేరుకున్న ఇరు దేశాల అధ్యక్షులు ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత బైడెన్​, పుతిన్​లు​ భేటీ అయ్యారు. అంతకుముందు వీరిద్దరూ కలిసిన సమయంలో బైడెన్​ ఉపాధ్యక్షుడిగా, పుతిన్​ ప్రధానిగా కొనసాగుతున్నారు.  

ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్​, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్​రోవ్​ కూడా పాల్గొన్నారు.  

అమెరికాపై ఇటీవల జరిగిన సైబర్​ దాడులు, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి మొదలైన అంశాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. వివాదాస్పద అంశాలైన ఇరాన్​ అణు ఒప్పందం, అఫ్గానిస్థాన్, లిబియా, ఉక్రేయిన్​, సిరియా దేశ పరిస్థితులపై కూడా బైడెన్​ పుతిన్​లు చర్చించినట్లు సమాచారం.  

ఈ చర్చల నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొందరు కార్యకర్తలు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. అణ్వాయుధాల వినియోగం, ఉత్పత్తిని కట్టడి చేసే విధంగా ఇరు పక్షాలు ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్​ చేశారు.  

సాఫీగా సాగాయి..

"బైడెన్​తో భేటీ నిర్మాణాత్మకంగా సాగింది. చర్చలు సాఫీగా జరిగాయి.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. వివిధ అంశాలపై మా మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి. కానీ ఒకరినొకరు అర్థం చేసుకునేందుకే ఇరు పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సైబర్​ భద్రతపై కూడా ఇరు దేశాలు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై సంప్రదింపులు జరిపేందుకు ఒప్పందం చేసుకున్నాం. అణు ఆయుధాలను కట్టడికి సంబంధించి కూడా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కృషి చేయాలని నిర్ణయించాం."  

-వ్లాదిమిర్​ పుతిన్, రష్యా అధ్యక్షుడు  

రాయబారులు రిటర్న్​..

రాయబారులకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్న వివాదానికి తెరదించుతూ పుతిన్​ కీలక ప్రకటన చేశారు. రాయబారులు సంబంధిత కార్యాలయాల్లో తిరిగి విధుల్లో చేరే విధంగా ఇరు పక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని వెల్లడించారు.  

మూడు నెలల క్రితం బైడెన్​.. పుతిన్​ను కిల్లర్​ అని సంబోధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా.. అమెరికాలోని ఆ దేశ రాయబారిని రష్యాకు తిరిగి చేరుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత మాస్కోలోని అమెరికా రాయబారి కూడా తిరిగి వాషింగ్టన్​కు చేరవలసి వచ్చింది.  

ఇదీ చదవండి: వారికి మాస్కు నిబంధన నుంచి విముక్తి

Last Updated : Jun 16, 2021, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.