కరోనా నాలుగో దశ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ (Austria Lockdown) విధించాలని ఆస్ట్రియా ప్రభుత్వం నిర్ణయించింది. పది రోజులు పాటు సాగే ఈ లాక్డౌన్ ఈనెల 22న అమలులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొంది. పాఠశాలలు, రెస్టారెంట్లను మూసివేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలను (Austria Lockdown) రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా 'ఫిఫ్త్ వేవ్' రాకుండా చూడాలన్నదే (Austria Lockdown) తమ ఆలోచన అని స్పష్టం చేశారు ఆస్ట్రియా ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్బర్గ్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టకపోతే మరో 10 రోజులపాటు లాక్డౌన్ను పొడిగిస్తామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆ దేశంలో టీకా వేయించుకోని వారిపై మాత్రమే లాక్డౌన్ అమలులో ఉంది. 12 ఏళ్ల కంటే ఎక్కువ ఉండి టీకా తీసుకోని వారు అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
గత ఏడు రోజులుగా ఆస్ట్రియాలో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
- మొత్తం కేసులు - 1,011,465
- మొత్తం మరణాలు - 11,903
- కోలుకున్నవారు - 8,67,601
- యాక్టివ్ కేసులు - 1,31,961
తాజా ప్రకటనతో మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన తొలి ఐరోపా దేశంగా ఆస్ట్రియా నిలిచింది.
సుమారు 90 లక్షల మంది జనాభా ఉన్న ఆస్ట్రియాలో 65.7 శాతం మంది మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు.
జర్మనీలో ఎమర్జెన్సీ..
ఆస్ట్రియా పొరుగు దేశమైన జర్మనీలో కూడా వైరస్ (Germany Covid Cases) వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజుకు 50 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ కట్టడికి తగిన చర్యలు చేపట్టే దిశగా ప్రయత్నిస్తోంది. దేశం.. అత్యవసర పరిస్థితికి చేరుకుందని ప్రభుత్వ వైద్య సలహాదారు లోతర్ వీలెర్ పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో రోజువారీ వైద్య సేవలకు (Germany Covid Cases) అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
కొవిడ్ కట్టడికి పార్లమెంట్ కొత్త నిబంధనలను ఆమోదించిన నేపథ్యంలో లోతర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం.. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో తిరగాలన్నా, ప్రజారవాణా వినియోగించుకోవాలన్నా (Germany Covid Cases) వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువపత్రం చూపించాలి. టీకా తీసుకోని పక్షంలో వారు కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుంది.
రష్యాలో తగ్గని ఉద్ధృతి..
రష్యాలోనూ రికార్డు స్థాయిలో మరణాలు (Russia Covid Cases) నమోదవుతున్నాయి. వరుసగా ముడో రోజు కూడా వెయ్యికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం.. 1,254 మంది కరోనా రోగులు మృతిచెందారు. ఈ సంఖ్య గురువారం 1,251, బుధవారం 1,247గా ఉంది. కొత్తగా 37,156 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
14.6 కోట్ల మందిలో ఇప్పటివరకు 40 శాతం మంది కూడా పూర్తిస్థాయిలో (Russia Covid Cases) వ్యాక్సిన్ తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటివరకు 2,61,000 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ప్రకటించినా.. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 4.62 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి : వంతెన కింద వేలాడిన 9 మృతదేహాలు.. ఎక్కడివి?