తన 8 శునకాల సహాయంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది జర్మనీకి చెందిన 12ఏళ్ల అలెక్సా లాన్బర్గర్. కాంగా అనే నృత్యాన్ని తన కుక్కలకు నేర్పించి "అత్యధిక శునకాలతో కాంగా లైన్" చేసినందుకు ఈ ఘనత సాధించింది.
ఏంటీ కాంగా...?
లాటిన్ అమెరికాకు చెందిన ప్రత్యేక నృత్యం ఈ కాంగా. ఇందులో ఒకరి వెనుక ఒకరు నిలబడతారు. ఈ రికార్డును సాధించడం కోసం... కాంగా వరుసలో మొదటి శునకం(సాలీ) అలెక్సాపై వాలుతూ వెళ్లగా.. మిగిలిన కుక్కలు సాలీని అనుసరించాయి. ఇలా 5మీటర్ల(16అడుగులు 5అంగుళాలు) దూరం ప్రయాణించాయని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ న్యాయనిర్ణేతలు తెలిపారు.
లాన్బర్గర్కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఒక్క ఫేస్‌బుక్‌లోనే 14లక్షల మందికిపైగా దీనిని వీక్షించారు. 700మందికి పైగా షేర్ చేశారు.
లాన్బర్గర్ ఇప్పటికే 'దాస్ సూపర్టాలెంట్' అనే జర్మన్ టాలెంట్ హంట్ రియాలిటీ షోలో తన ప్రతిభను ప్రదర్శించి అందర్ని ఆకట్టుకుంది. 'అమెరికా గాట్ టాలెంట్'లో కూడా ఆమె నటనతో న్యాయమూర్తులను మెప్పించింది.
-
If you love dogs, prepare to freak out over Alexa Lauenburger’s barkin’-good performance! 🐶 pic.twitter.com/SVVTTkFI1Q
— America's Got Talent (@AGT) January 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">If you love dogs, prepare to freak out over Alexa Lauenburger’s barkin’-good performance! 🐶 pic.twitter.com/SVVTTkFI1Q
— America's Got Talent (@AGT) January 21, 2020If you love dogs, prepare to freak out over Alexa Lauenburger’s barkin’-good performance! 🐶 pic.twitter.com/SVVTTkFI1Q
— America's Got Talent (@AGT) January 21, 2020
ఇదీ చూడండి: వారి అత్యుత్సాహంతో ఎడారిలా మారిన జలాశయం