ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌కు ఆగ్నేయ ప్రాంతంలోని పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు చిన్న విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు.
టూర్స్ ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలోని డీ లోచే పట్టణంలో శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు నగర మేయర్ మార్క్ ఏంజెనాల్డ్ తెలిపారు. ఇళ్ల సమీపంలోని ఓ మైదానంలో రెండు విమానాలు కుప్పకూలటం వల్ల పెను ప్రమాంద తప్పిందన్నారు. కింద ఎవరికి ఎలాంటి హాని జరగలేదని చెప్పారు మార్క్.
మరణించిన వారిలో అల్ట్రా లైట్ విమానంలో ఇద్దరు, మరో చిన్న విమానంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో భయటపడ్డారా అనేది సమాచారం లేదని తెలిపారు.
ఘటనా స్థలానికి 50 అగ్నిమాపక యంత్రాలు, 30 మంది పారామిలటరీ దళాలతో పాటు విమానయాన నిపుణులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా జీన్ కాస్టెక్స్