ETV Bharat / international

ఆ వైరస్​తో మాకు సంబంధం లేదు: వుహాన్​ ల్యాబ్​

author img

By

Published : Apr 19, 2020, 3:48 PM IST

వుహాన్​ వైరాలజీ ల్యాబ్​ నుంచే కరోనా వైరస్​ బయటపడిందన్న వార్తలను ఖండించారు ఆ ల్యాబ్​ డైరక్టర్​ యువాన్​ జిమింగ్​. ఇలాంటి సమయంలో అమెరికా దుష్ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరమన్నారు.

Wuhan virology lab chief denies COVID-19 originated from institute, says virus 'cannot be man made'
మా తప్పేమీ లేదు: వుహాన్​ వైరాలజీ ల్యాబ్​

తమపై వస్తున్న ఆరోపణలను చైనాలోని వుహాన్​ వైరాలజీ ల్యాబ్​ ఖండించింది. ప్రాణాంతక మహమ్మరి కరోనా వైరస్​ వంటి వైరస్​లను రూపొందించే శక్తి మనుషులకు లేదని తెలిపింది.

వైరస్​కు పుట్టినిల్లు అయిన వుహాన్​లో వైరాలజీ ల్యాబ్​ ఉండటం, దాని సమీపంలోనే వైరస్​ను తొలిసారి గుర్తించిన మార్కెట్​ ఉండటం తీవ్ర అనుమానాలకు దారి తీశాయి. కరోనా వైరస్​ అదే ల్యాబ్​ నుంచి తప్పించుకుందన్న నివేదికలను పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం ఈ ఊహాగానాలను మరింత పెంచాయి.

ఈ నేపథ్యంలో వైరాలజీ ల్యాబొరేటరీ డైరక్టర్​ యువాన్​ జిమింగ్​​ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. తాము ఎలాంటి వైరస్​లపై పరిశోధనలు చేస్తామో తమకు తెలుసని.. ఇలాంటి వైరస్​ తమ నుంచి బయటకు రాలేదని ధీమా వ్యక్తం చేశారు.

ప్రపంచం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అమెరికా ఇలాంటి ఆరోపణలు చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు యువాన్​.

"వారి(అమెరికా) ఆరోపణలన్నీ ఊహాగానాలే. ప్రజలను తప్పుదోవ పట్టించి మా శాస్త్రవేత్తల కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడానికి ఇలా చేస్తున్నారు. కానీ ఇది సాధ్యం కాదు. ఈ వైరస్​ను మనిషి రూపొందించలేడు."

--- యువాన్​ జిమింగ్​, వుహాన్​ వైరాలజీ ల్యాబ్​ డైరక్టర్​.

వైరస్​ వ్యాప్తి చెందినప్పుడు తమ వద్ద ఉన్న సమాచారం, కరోనా వైరస్​ జీనోమ్​ సీక్వెన్స్​ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)తో పంచుకున్నట్టు తెలిపారు యువాన్​.

ఇదీ చూడండి:- వుహాన్​లో కరోనాపై చైనా మరో కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.