ETV Bharat / international

ప్రజల చెంతకే ప్రకృతి అందాలు.. చైనా వినూత్న ఆలోచన

author img

By

Published : Feb 26, 2020, 10:04 PM IST

Updated : Mar 2, 2020, 4:42 PM IST

చైనాలో పుట్టి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్​ ప్రభావం ప్రకృతి అందాలపైనా పడింది. ప్రతి ఏడాది ఈ సీజన్​లో పూలు చూసి మురిసిపోయే సందర్శకులకు ఈ సంవత్సరం నిరాశే ఎదురైంది. ప్రకృతి చెంతకు రాలేని ప్రజల కోసం అధికారులు వినూత్నంగా ఈ అందాలను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.

With severe travel restrictions in China during the coronavirus outbreak, it seemed that most people would miss this year's cherry blossom season
ప్రజల చెంతకే ప్రకృతి అందాలు.. చైనా వినూత్న ఆలోచన

ప్రపంచాన్నే భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది అందమైన చెర్రీ పూలు వికసించే కాలాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు చైనా ప్రజలు దూరమవుతున్నారు. కొవిడ్​- 19 కారణంగా షాంఘై చెన్షాన్ బొటానికల్ గార్డెన్​ను జనవరి 24 నుంచి తాత్కాలికంగా మూసివేశారు. కానీ, పరోక్షంగా ఇంటర్నెట్​ ద్వారా ఆ అందాలను వీక్షించే అవకాశాన్ని కల్పించారు అధికారులు.

షాంఘై చెన్షన్​ బొటానికల్​ గార్డెన్​ అందాలను ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. దీని వల్ల ప్రజలు తమ ఇళ్ల నుంచే వీటిని వీక్షిస్తున్నారు. సాధారణంగా పర్యటకులు నేరుగా సందర్శించే సమయంలో వృక్ష శాస్త్రజ్ఞులు ఈ గార్డెన్ చుట్టూ వారితో పాటు నడుస్తూ వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి వివరించే వారు.

With severe travel restrictions in China during the coronavirus outbreak, it seemed that most people would miss this year's cherry blossom season
ఆకట్టుకుంటోన్న బొటానికల్ గార్డెన్​

" కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో నిత్యం సందడిగా ఉండే షాంఘై చెన్షాన్ బొటానికల్ గార్డెన్ పరిసరాలు ఈ ఏడాది బోసిపోయాయి. అయితే ప్రజలకు ఆ అనుభూతిని అందించాలని భావించాం. అందుకు ఈ ఏడాది పరోక్షంగా ఆ అందాలను చూసే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించి ఆన్​లైన్ సేవలు ప్రారంభించాం. దీంతో ప్రజలు తమ చరవాణిల ద్వారా ఈ పరిసరాలను చూస్తూ ఇతరులకు చూపిస్తారు."

--- ఝాంగ్​ ఝె, సైన్స్ పాపులైజేషన్ అండ్ మీడియా ఆఫీస్, షాంఘై చెన్షన్ బొటానికల్ గార్డెన్

ఆకట్టుకుంటోన్న పూలు

6 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ పూలవనంలో చెర్రీ పూలతో పాటు మొట్టమొదటి సారిగా షాంఘైలో వికసించిన కవాజు- కాకురా పూలు దర్శనమిస్తాయి. సాధారణంగా ఈ కాలంలో ఈ అందాలను వీక్షించేందుకు సుమారు లక్ష మంది పర్యటకులు వస్తారని అధికారులు తెలిపారు.

చూడముచ్చటగా మార్గానికి ఇరువైపులా..

పూలు ఎంత అందంగా ఉన్నాయో..

ఇదీ చదవండి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతి

Last Updated : Mar 2, 2020, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.