ETV Bharat / international

వుహాన్​ మార్కెట్లో కొవిడ్​ మూలాలపై పరిశోధన

author img

By

Published : Jan 31, 2021, 11:43 AM IST

చైనాలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం.. వుహాన్​లోని మాంసాహార మార్కెట్​ను ఆదివారం సందర్శించింది. వారితో పాటు పెద్ద సంఖ్యలో చైనా అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు.

WHO team
వుహాన్​ మార్కెట్​ను సందర్శించిన డబ్ల్యూహెచ్​ఓ బృందం

కరోనా మూలాలను కనుగొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) నిపుణుల బృందం.. పరిశోధనను ముమ్మరం చేసింది. వైరస్​ వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న వుహాన్​లోని అతిపెద్ద మాంసాహార మార్కెట్​ను ఆదివారం సందర్శించింది. డబ్ల్యూహెచ్​ఓ బృందంతో పాటు పెద్ద సంఖ్యలో చైనా అధికారులు, ప్రతినిధులు మార్కెట్​ సందర్శనకు హాజరయ్యారు.

తొలిదశలో కరోనా కేసులు నమోదైన వుహాన్​లోని జిన్​యాన్​టాన్​ ఆసుపత్రిని, హుబెయ్​లోని చైనీస్​, వెస్టర్న్ మెడిసిన్​ ఆసుపత్రిని ఇప్పటికే ఈ బృందం సందర్శించింది. ఓ మ్యూజియంలోనూ శనివారం పర్యటించింది. ఇటీవలే 14రోజుల క్వారంటైన్​ పూర్తి చేసుకున్న ఈ బృందం.. క్షేత్రస్థాయి పరిశోధనను చేపట్టింది.

హునాన్​లోని సీఫుడ్​ మార్కెట్​ సహా, వుహాన్​లోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ ప్రయోగశాలను కూడా ఈ బృందం సందర్శించనుందని డబ్ల్యూహెచ్​ఓ గత వారం ట్విట్టర్​ వేదికగా తెలిపింది. వైరస్​ తమ దేశంలో పుట్టలేదని చైనా వాదిస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్​ఓ పర్యటనపై రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:డబ్ల్యూహెచ్​ఓ పర్యటనతో చైనా కరోనా గుట్టు వీడుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.