ETV Bharat / international

వుహాన్​ ఆస్పత్రుల్లో కరోనా మూలాలపై శోధన

చైనాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభించింది. పర్యటనలో భాగంగా వుహాన్​లో తొలిదశలో కరోనా కేసులు నమోదైన ఆస్పత్రులను సందర్శిస్తోంది.

WHO, wuhan
వుహాన్​లో డబ్ల్యూహెచ్​ఓ క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభం
author img

By

Published : Jan 30, 2021, 10:06 AM IST

చైనాలో 14 రోజుల క్వారంటైన్ ముగించుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణుల బృందం.. క్షేత్రస్థాయిలో కరోనా మూలాలపై పరిశోధనను ప్రారంభించింది. వుహాన్​లో తొలిసారి కరోనా రోగులను గుర్తించిన ఆస్పత్రుల్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా జిన్​యాన్​టాన్​ ఆస్పత్రిని శనివారం సందర్శించారు నిపుణులు. అంతకుముందు రోజు చైనా శాస్త్రవేత్తలతో చర్చలు జరపడం సహా హుబియ్​ ఆస్పత్రిలో పర్యటించారు. వుహాన్​లోని ఆస్పత్రులతో పాటు వైరస్ వ్యాప్తికి కారణమని భావిస్తున్న హునన్​ సీ-ఫుడ్​ మార్కెట్​, వుహాన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ వైరాలజీ, స్థానిక ల్యాబ్​లను సందర్శించనున్నారు.

ప్రాథమిక దర్యాప్తులో కొంత సమాచారం సేకరించామని, వైరస్​ మూలాలను కనుగొనేందుకు మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ గురువారం చేసిన ట్వీట్​లో పేర్కొంది.

ఇదీ చదవండి : పాక్‌ సుప్రీంకోర్టు తీర్పుపై శ్వేతసౌధం ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.