ETV Bharat / international

వుహాన్​లో డబ్ల్యూహెచ్ఓ బృందం దర్యాప్తు షురూ

కరోనా మహమ్మారి ఆవిర్భావంపై డబ్ల్యూహెచ్​ఓ బృందం చైనాలో దర్యాప్తు ప్రారంభించింది. 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉన్న నిపుణుల బృందం.. గురువారం క్షేత్రస్థాయి పరిశీలన మొదలుపెట్టింది.

WHO team in Wuhan departs quarantine for Covid origins study
నిపుణుల బృందం క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభం
author img

By

Published : Jan 29, 2021, 12:11 AM IST

చైనాలో కరోనా వైరస్ మూలాలు గుర్తించేందుకు చైనా వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్​ఓ) నిపుణుల బృందం.. దర్యాప్తు ప్రారంభించింది. రెండు వారాల క్వారంటైన్ ముగించుకొని వుహాన్​లో గురువారం క్షేత్రస్థాయి పరిశీలన కోసం వెళ్లింది. బృందంలోని 14 మంది సభ్యులు నెలరోజుల పాటు తమ పరిశోధనను కొనసాగించనున్నారు. మహమ్మారి మానవులకు ఎలా సంక్రమించింది అనే దానిపై అన్వేషించనున్నారు.

చైనా చేరుకున్న తర్వాత కరోనా మార్గదర్శకాలను అనుసరించి వుహాన్​లోని ఓ హోటల్​లో 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉన్నారు నిపుణులు. గురువారం బృందంలోని సభ్యులంతా హోటల్​ నుంచి బయటకు వస్తూ కనిపించారు. అందులోని సభ్యులు కొందరు ఫోటోలను ట్విట్టర్​లో పోస్టు చేశారు. చైనాలోని కొవిడ్​ నిబంధనలను పాటిస్తూ వూహాన్​ ప్రజలతో నిపుణుల బృందం మాట్లాడుతుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ తెలిపారు.

వుహాన్​లోని జంతువుల మార్కెట్ నుంచి మానవునికి కరోనా సోకిందని మొదటగా వార్తలు వినిపించాయి. అయితే దాన్ని స్థానిక ప్రభుత్వం గత ఏడాది ప్రారంభంలో మూసివేసింది.

ఇదీ చూడండి: డబ్ల్యూహెచ్​ఓ బృందం వుహాన్ పర్యటన ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.