ఈ ఏడాది ఏప్రిల్ 15 నాటికి భారత్‌లో కరోనాతో 50 వేల మంది మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించినట్లు ట్విట్టర్లో చక్కర్ల కొడుతున్న వీడియో ఫేక్ అని స్పష్టం చేసింది ఆ సంస్థ. ఇటువంటి హెచ్చరికలేవి డబ్ల్యూహెచ్ఓ చేయలేదని, ట్విట్టర్ వేదికగా వెల్లడించింది డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయం.
విదేశాలకు కరోనా టీకాను పంపిణీ చేయడంపై భారత్‌ను అభినందించారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో భారత్‌ను అనుసరించాలని ఇతర దేశాలకు సూచించారు.
ఇదీ చూడండి: 'విదేశాలకు భారత టీకా సరఫరాపై కరోనా ఎఫెక్ట్'