ETV Bharat / international

చైనాలో మరోసారి కరోనా విజృంభణ - చైనాలో కరోనా వ్యాప్తి

తొలి కొవిడ్​ కేసు బయటపడిన చైనాలో.. వైరస్​ మరోసారి విస్తరిస్తోంది. రుయిలీ నగరంలో ఆదివారం ఒక్కరోజే 20 మందికిపైగా వైరస్​ నిర్ధరణ కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 100 దాటింది. ఈ క్రమంలో కరోనాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు.

Virus cases rise in southwestern Chinese city
చైనాలో మరోసారి కరోనా విజృంభణ
author img

By

Published : Apr 5, 2021, 9:58 AM IST

చైనాలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. మయన్మార్​ సరిహద్దులోని నైరుతీ చైనా నగరమైన రుయిలీలో 100కుపైగా కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో రుయిలీలో మొత్తం 3లక్షల మందికి టీకా అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఐదురోజుల వ్యాక్సిన్​ డ్రైవ్​ ప్రారంభించారు.

ఈ నగరంలో ఆదివారం మరో 20 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలినట్టు అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్​ తెలిపింది. బాధితుల్లో ఐదుగురికి వైరస్​ లక్షణాలేవీ కనిపించలేదని పేర్కొంది.

రుయిలీలో వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. నగర సరిహద్దులో భద్రతా చర్యల్ని మరింత కట్టుదిట్టం చేశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.

ఇదీ చదవండి: కొవిడ్​ లక్షణాలు మూడు రకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.