పాండాలంటే జంతు ప్రేమికులకు చాలా ఇష్టం. ఇక జూ వంటి ప్రాంతాల్లో అవి చేసే సందడి అంతా ఇంతా కాదు. సాధారణంగానే ముద్దుముద్దుగా ఉండే పాండాలు తమను జాగ్రత్తగా చూసుకునే సంరక్షకులకు అల్లరి చేష్టలతో ఒక్కోసారి చుక్కలు చూపిస్తుంటాయి. ఇంకొన్ని సార్లు ఎంతో ప్రేమగా ఉంటాయి. తాజాగా.. పాండాలకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. అవి సరదాగా ఆడుకుంటూ వీక్షకుల మనసును దోచుకుంటున్నాయి. నాలుగు పాండాలు ఓ పార్క్లో సందడి చేస్తూ కనిపించాయి. సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
ఈ వీడియోలో పాండాలు.. జారుడు బల్లపై నుంచి చిన్నపిల్లలు జారినట్లు జారుతూ బాగా ఆడుకున్నాయి. మెట్లెక్కి జారుడు బల్లమీదికి చేరుకుని.. అక్కడ నుంచి కిందకి దొర్లుతూ ఒకదాని మీదకొకటి పడుతూ సందడి చేశాయి. సంరక్షకురాలు వాటిని జాగ్రత్తగా ఆడించింది. ఇలా ఈ పాండాలు చేస్తున్న సందడి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
-
Panda slide! 😊 pic.twitter.com/aA5pWKj6Rz
— Buitengebieden (@buitengebieden_) July 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Panda slide! 😊 pic.twitter.com/aA5pWKj6Rz
— Buitengebieden (@buitengebieden_) July 30, 2021Panda slide! 😊 pic.twitter.com/aA5pWKj6Rz
— Buitengebieden (@buitengebieden_) July 30, 2021
ఇదీ చూడండి: జూలో ఘనంగా పుట్టినరోజు చేసుకున్న 'పాండా'