చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా 'సీపెక్' ద్వారా పాక్ మరింత రుణ సంక్షోభంలోకి వెళ్తుందని అమెరికా హెచ్చరించింది. డ్రాగన్ దేశం భారీ మౌలిక సదుపాయాల కల్పన వల్ల స్వల్ప రాబడితో దీర్ఘకాలిక ఆర్థిక నష్టాన్ని పాకిస్థాన్ ఎదుర్కొంటుందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల కార్యదర్శి ఆలిస్ వెల్స్ వివరించారు. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలకు లాభాలను తెచ్చిపెట్టే ఫైనాన్సింగ్ రూపంగా సీపెక్‌ను అభివర్ణించారు వెల్స్.
చైనా ప్రభుత్వ సంస్థలు బిలియన్ డాలర్లు పెట్టుబడుల రూపంలో పెట్టినప్పటికీ.. దీర్ఘకాలంలో చైనా పెట్టుబడి రుణాలను చెల్లించలేక పాక్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని వెల్స్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా చైనా వస్తువులు పాకిస్థాన్‌లోకి పెద్దఎత్తున దిగుమతి అవడమే కాకుండా స్థానికుల ఉపాధి అవకాశాలను చైనా కార్మికులు సొంతం చేసుకుంటారని వెల్స్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: గ్రెటా థన్‌బర్గ్‌కు 'అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి'