ETV Bharat / international

Bus for sleeping: హాయిగా నిద్ర పోవాలా? ఈ బస్సు ఎక్కండి!

Bus for sleeping: మీకు ఇంట్లో నిద్రపట్టడం లేదా? బస్సులో మాత్రం ఎంచక్కా నిద్రొస్తుందా? అయితే ఇది మీ కోసమే. కొంత మొత్తం డబ్బు చెల్లిస్తే.. డబుల్​ డెక్కర్​ బస్సులో ప్రయాణిస్తూ నిద్రపోవచ్చు. 'స్లీపింగ్​ బస్ ​టూర్' పేరుతో వినూత్న సేవల్ని ప్రవేశపెట్టింది ఓ టూర్​ ఏజెన్సీ. 52 మైళ్ల దూరం(దాదాపు 83 కి.మీ.) బస్సులో మిమ్మల్ని తిప్పుతూనే ఉంటుంది. మెలకువ వస్తే చుట్టుపక్కల ప్రకృతి అందాలను చూస్తూ గడిపేయొచ్చు.

Bus for sleeping in Hongkong
పడుకోవడానికి బస్సులు
author img

By

Published : Dec 1, 2021, 6:55 PM IST

Bus for sleeping: రోజంతా ఎంతో కష్టపడతాం.. అలసిసొలసి రాత్రి హాయిగా నిద్రకు ఉపక్రమించేస్తాం. కానీ.. కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అయితే.. వద్దన్నా నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. చల్లగాలికి, బస్సు వేగానికి చక్కగా కునుకు తీయొచ్చు.

Sleeping bus tour:

ఈ విషయాన్ని గుర్తించిన హాంకాంగ్​లోని ఉలూ ట్రావెల్స్​ అనే సంస్థ 'స్లీపింగ్​ బస్​ టూర్​' పేరుతో వినూత్న సేవల్ని ప్రవేశపెట్టింది. ఇంట్లో పడకపై నిద్ర పట్టని వారు, నిద్రలేమితో బాధపడేవారు తమ బస్సులో ప్రయాణిస్తూ ఐదు గంటలపాటు నిద్రపోవచ్చని తెలిపింది. హాంకాంగ్‌ పరిధిలో తమ డబుల్‌ డెక్కర్‌ బస్‌ 5 గంటలపాటు 52 మైళ్ల మేర(దాదాపు 83 కి.మీ.) గమ్యం లేకుండా తిరుగుతుందని.. చివరకు ఎక్కిన చోటే దించేస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

  • VIDEO: Most of us will have experienced drifting off to sleep during a lengthy bus journey

    But would you pay to do just that?

    That's the idea behind a novel tour bus business in Hong Kong billing itself as a possible cure for insomnia pic.twitter.com/pnKooid5Bp

    — AFP News Agency (@AFP) November 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • టికెట్‌ ధర సీటు ఎంపికను బట్టి ఉంటుంది. లోయర్​ డెక్​లో అయితే.. 12 డాలర్లు, అప్పర్​ డెక్​లో 51 డాలర్ల చొప్పున వసూలు చేస్తారు.
  • ప్రయాణికులకు కళ్లకు పెట్టుకునే మాస్క్‌, బయటి శబ్దాలు వినిపించకుండా చెవులకు ఇయర్‌ ప్లగ్స్‌ను ఇస్తారు.
  • ఈ టూర్​లో భాగంగా.. ప్రకృతి అందాలను, పర్యటక ప్రదేశాలను కూడా చుట్టేయొచ్చు.

ఈ ప్రయత్నానికి.. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఉలూ ట్రావెల్స్‌ యజమాని ఫ్రాంకీ చౌ చెప్పుకొచ్చారు. ట్రాఫిక్​ ఎక్కువగా లేని చోట, ప్రయాణికుల నిద్రకు ఆటంకం కలగకుండా ఓ ఉత్తమ మార్గాన్ని తాను సృష్టించినట్లు వెల్లడించారు.

Bus for sleeping in Hongkong
బస్సు కోసం తరలివస్తున్న ప్రయాణికులు

''రెండు వర్గాల ప్రయాణికుల కోసం ఈ సదుపాయం తీసుకొచ్చాం. మొదటిది.. నిద్రలేమితో బాధపడేవారు. రెండోది.. నిద్రించడానికి మంచి స్పాట్​ కోసం ఎదురుచూసేవారు. ఇంకా రవాణా ఆంక్షల నడుమ.. పర్యటక ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడేవారికి ఇది ఉపయోగకరం.''

- ఫ్రాంకీ చౌ, ఉలూ ట్రావెల్​ అధ్యక్షుడు

చక్కటి అనుభూతి..

పని ఒత్తిడిలో హాంకాంగ్​లో చాలా మందికి సరిగా నిద్ర ఉండదని, అసలు ప్రయాణం చేయడానికే ఓపిక ఉండదని అంటున్నాడు ప్రయాణికుడు హో వై. కానీ.. బస్సులో నిద్ర ఏర్పాటు చేయడం.. చక్కటి అనుభవమని చెబుతున్నాడు.

Bus for sleeping in Hongkong
బస్సులో కునుకుతీస్తూ..

''ఇంట్లో సరిగా నిద్రపట్టకపోవడం చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ బస్సు ఊగుతూ తూలుతూ వెళ్తున్నప్పుడు హాయిగా నిద్రపోవచ్చు.''

- హో వై, ప్రయాణికుడు

ప్రశాంతత, నిశ్శబ్దం కోసం డబ్బులు చెల్లించడం అనే పద్ధతి హాంకాంగ్​కు మాత్రమే పరిమితం కాలేదు. పని ఒత్తిడిలో ఏకాంతం, ప్రశాంతత కోరుకునేవారి కోసం దక్షిణ కొరియా ఒక ఆలోచన చేసింది. కెఫేల్లో స్లాట్లు బుక్​ చేసుకొని, గంటల తరబడి అలాగే కూర్చోవచ్చు.

Silent Cafe Japanese Restaurant:

2015లో జపాన్​లో సైలెంట్​ కెఫేలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఒంటరిగా సమయం గడపాలనుకునేవారు అక్కడికి వెళ్లి సేదతీరొచ్చు. దీనికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇవీ చూడండి:

ఆ నగరంలో మాదకద్రవ్యాల క్లబ్​లు.. వాడకాన్ని తగ్గించేందుకే!

US Travel Requirements: అమెరికా వెళ్లాలా? కొత్త రూల్స్​ తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.