ETV Bharat / international

మయన్మార్​లో ఏటీఎంల వద్ద ప్రజల పడిగాపులు - మయన్మార్​లో సైనిక చర్య

మయన్మార్​లో సైనిక పాలన కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. బ్యాంకింగ్ సేవలు పూర్తిగా దెబ్బతిన్న క్రమంలో ప్రజలు నగదు డ్రా చేసుకునేందుకు ప్రజలు ఏటీఎం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో ఏటీఎంలో రోజూవారీ నగదు డ్రాకు పరిమితి విధిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Myanmar banks
ఏటీఎంల ముందు ప్రజల పడిగాపులు
author img

By

Published : May 11, 2021, 6:34 PM IST

Updated : May 11, 2021, 6:49 PM IST

ఏటీఎంల వద్ద ప్రజల పడిగాపులు

సైనిక చర్య, కొవిడ్​ మహమ్మారితో మయన్మార్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో ప్రజలు తమ రోజువారీ అవసరాలు, ఖర్చుల కోసం.. నగదును డ్రా చేసుకునేందుకు ఏటీంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది ఆహారం తెచ్చుకుని మరీ ఏటీఎంల ముందు తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు.

huge ques at mayanmar
క్యూలో కూర్చుని నిరీక్షణ
people at atm centres in mayanmar
క్యూలో నిలబడలేక.. అవస్థలు

తమ వంతు రాకముందే..

ఒక్కో ఏటీఎంలో ఎంత నగదు డ్రా చేయాలో పరిమితి విధిస్తున్నారని యాంగాంగ్ నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వంతు వచ్చేసరికి ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయని వాపోతున్నారు. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లు క్యూలో నిల్చోకుండా టోకెన్లు జారీ చేస్తున్నారని.. అయితే ఆ టోకెన్లు బుక్ చేసుకునేందుకు కార్యాలయాలకు ఫోన్​లు చేస్తే స్పందించటం లేదన్నారు.

que at maynamar
గొడుగులతో కూర్చొని ఎదురుచూపు
people at atm centres in mayanmar
క్యూలో నిలబడలేక.. అవస్థలు
crowd at atms in mayanmar
ఏటీఎంల వద్ద ప్రజల పడిగాపులు

ఇటీవల యూఎన్​డీపీ(యునైటెడ్ నేషన్స్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్) సైతం.. మయన్మార్​లోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో సైనిక పాలన, కొవిడ్ మహమ్మారి దృష్ట్యా.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపింది.

ఇదీ చదవండి : దేశం 'లాక్​డౌన్'- అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు!

Last Updated : May 11, 2021, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.