అడవులను కాల్చేసి, వేలాది జంతువుల మృతికి కారణమైన కార్చిచ్చుపై ఆస్ట్రేలియా వాసుల ఆగ్రహం పెల్లుబికింది. సిడ్నీ నగరం వీధుల్లోకి ప్రజలు వేల సంఖ్యలో చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవాలని.. కార్చిచ్చు సంక్షోభంపై ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ స్పందించాలని కోరుతూ నినాదాలు చేశారు. న్యూసౌత్ వేల్స్ లోని టౌన్‌హాల్ నుంచి పార్లమెంట్ భవనం వరకు ర్యాలీ తీశారు.
జంతువుల రక్షణ కోసం..
దక్షిణ ఆస్ట్రేలియాలోని కంగారూ ద్వీపంలోని వన్యప్రాణి ఉద్యానవాన్ని గాయపడిన జంతువులను కాపాడేందుకు వినియోగిస్తున్నాడు యజమాని సామ్ మిషెల్. కోలాలు, కంగారులు వంటి గాయపడిన అనేక జంతువులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నాడు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 25వేల కోలాలు మృతి చెందాయి. లక్షా 70వేల ఎకరాల అడవి దగ్ధమైంది.
ఇదీ చూడండి: భగ్గుమన్న అగ్నిపర్వతం.. ఆకాశాన్ని తాకేలా ఎగసిన లావా