ఐక్యరాజ్య సమితి వేదికగా మరోమారు కశ్మీర్ అంశాన్ని(kashmir issue in un)పాకిస్థాన్ లేవనెత్తటాన్ని తిప్పికొట్టింది భారత్(India slams Pakistan at UN). తీవ్రవాద బాధిత దేశం ముసుగు వేసుకుని ఉగ్రవాదలకు పాక్ మద్దతుగా నిలుస్తోందని పేర్కొంది. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్నే పెద్ద దోషి అని అన్నారు. ముందు దేశంలోని సొంత మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులపై అరాచకాలను ఆపాలని హితవు పలికింది.
ఉగ్రవాదంపై పోరాటం నిరంతరాయంగా, అన్ని రంగాలలోనూ ఉండాలని నొక్కి చెప్పారు ఐరాసలో భారత శాశ్వత మిషన్ లీగల్ అడ్వైజర్ (Legal Adviser at India's Permanent Mission to the UN) డాక్టర్ కాజల్ భట్. ఉగ్రవాద నిర్మూలన కోసం ఐరాస సభ్య దేశాలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని నొక్కి చెప్పారు.
అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని(Terrorism) నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశమైన.. యూఎన్ సాధారణ సమావేశాలు 6వ కమిటీ(లీగల్)లో మాట్లాడారు భట్.
"పాకిస్థాన్ ఈ ఆగస్ట్ ఫోరమ్‌ను దుర్వినియోగం చేసిందని నా అసంతృప్తిని తెలియజేస్తున్నాను. భారత్ పేరును ప్రస్తావించిన వారి తీరును ఖండిస్తున్నాం. వారి ఆరోపణలు, సూచనలను తిరస్కరిస్తున్నాం. జమ్ముకశ్మీర్, ఇప్పుడు, ఎప్పటికీ.. భారత్‌లోని అంతర్గత భాగం. సొంత మైనారిటీలపై అరాచకాలను ఆపాలని పాకిస్థాన్‌ను కోరుతున్నాం. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, సురక్షిత ఆవాసాలు కల్పించటంతో వారికి మద్దతు తెలుపుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. "
- డాక్టర్ కాజల్ భట్, యూఎన్‌లో భారత మిషన్‌కు లీగల్ అడ్వైజర్.
ఐరాసలో పాకిస్థాన్ రాయబారి మునిర్ అక్రమ్.. 6వ కమిటీ భేటీలో మరోమారు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన క్రమంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భట్(India slams Pakistan at UN).
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరుగుతోందని, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు భట్. డ్రోన్లు, వర్చువల్ కరెన్సీ, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ వంటి అధునాతన సాంకేతికతలతో ఉగ్రవాదులు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ఆయా పరిస్థితులను మరింత పెంచిందన్నారు. ఒక్క ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నా.. యావత్ ప్రపంచానికి ముప్పు ఉంటుందని గుర్తు చేశారు. కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి: Sneha Dubey: పాక్ నోరు మూయించిన బక్క పల్చని అమ్మాయి..