ETV Bharat / international

కొవిడ్‌ మూలాలు కనుగొనేందుకు గబ్బిలాలకై అన్వేషణ!

కరోనా వైరస్​ మూలాలను కనుగొనేందుకు థాయిలాండ్‌లో పరిశోధనలు చేపట్టారు. దీని కోసం గబ్బిలాలు నివసించే స్థావరాలపై గాలింపు చేపట్టారు. చైనా బయట తొలిసారిగా థాయిలాండ్‌లోనే కరోనా వైరస్‌ బయటపడడంతో ఈ గబ్బిలాలపై జరుపుతున్న పరిశోధనలపై ఆసక్తి నెలకొంది.

author img

By

Published : Aug 14, 2020, 7:31 AM IST

Thailand-Scientists-catch-bats-for-corona-origin
కొవిడ్‌ మూలాల కనుగొనేందుకు గబ్బిలాల కోసం అన్వేషణ!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ఎక్కడినుంచి వచ్చిందనే విషయంపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన నిపుణులు బృందం చైనాలో ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసింది. తాజాగా దీనిపై థాయిలాండ్‌లోనూ పరిశోధనలు చేపట్టారు. కరోనా వైరస్‌ మూలాలను కనిపెట్టేందుకు అక్కడి గబ్బిలాల కోసం అవి నివసించే స్థావరాలపై గాలింపు చేపట్టారు. చైనా బయట తొలిసారిగా థాయిలాండ్‌లోనే కరోనా వైరస్‌ బయటపడడంతో ఈ గబ్బిలాలపై జరుపుతున్న పరిశోధనలపై ఆసక్తి నెలకొంది.

ప్రపంచవ్యాప్తంగా 2కోట్ల మందిలో బయటపడ్డ కరోనా వైరస్ మహమ్మారి‌ ఇప్పటికే 7లక్షల 50వేల మందిని బలితీసుకుంది. ఇంతటి మహమ్మారి ముఖ్యంగా గబ్బిలాల నుంచే వ్యక్తులకు సోకిందనే అభిప్రాయం ఆదిలోనే వ్యక్తమైంది. దక్షిణ చైనాలోని యున్నాన్‌లో గబ్బిలాల్లో బయటపడిన వైరస్‌కు కరోనా వైరస్‌ పోలికలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. తాజాగా థాయిలాండ్‌ కూడా గబ్బిలాల్లో పరిశోధన మొదలుపెట్టింది. ఇప్పటికే వీరిదగ్గర దాదాపు 19జాతులకు చెందిన గబ్బిలాలు ఉన్నప్పటికీ, వీటిపై ఇప్పటివరకు కరోనా పరిశోధన పరీక్షలు చేయలేదని సమాచారం. ప్రస్తుతం వైరస్ మూలాలను కనుగొనే ప్రయత్నాలు ముమ్మరం చేసిన థాయిలాండ్‌ శాస్త్రవేత్తలు మరో 200లకు పైగా గబ్బిలాలను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీటికోసం సాయ్‌ యాక్‌ జాతీయ పార్కులో ఉన్న గుహల్లో అన్వేషణ మొదలుపెట్టారు. అక్కడ వీటిని పట్టుకునేందుకు థాయిలాండ్‌ రెడ్‌క్రాస్‌కు చెందిన ఆరోగ్య కేంద్రం నిపుణులు ప్రత్యేక గూళ్లను ఏర్పాటు చేశారు.

గబ్బిలాలు, వాటినుంచి సంక్రమించే వ్యాధులపై గత 20సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతున్న సుపాపార్న్‌ ఈ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్నారు. ఆ గుహల్లో ఉండే వివిధ జాతుల గబ్బిలాల నుంచి రక్తం, లాలాజలంతోపాటు అవి విడుదల చేసే వ్యర్థాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. తద్వారా వీటిలో ఉండే వ్యాధికారక వైరస్‌ల గురించి మరింత పరిశోధనలను చేసేందుకు వీలుంటుందని సుపాపార్న్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా కొవిడ్‌-19కు కారణమైన వైరస్‌కూడా ఈ గబ్బిలాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు ఆమె అభిప్రాయపడుతున్నారు. 'ఈ మహమ్మారికి సరిహద్దులు లేవు. ఈ వైరస్‌ గబ్బిలాల నుంచి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రదేశానికైనా ఇవి వెళ్లగలవు' అని పరిశోధకురాలు సుపాపార్న్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: విభేదాలకు చెక్.. ఇజ్రాయెల్‌-యూఏఈ చారిత్రక ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.